Triple Jackpot To Govt Employees Including 8th Pay Commission And DA DR: పండుగల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ జాక్‌పాట్ లభించనుంది. ప్రభుత్వం భారీగా కానుకలు ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మూడు బహుమతులు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/7పండుగల సీజన్ ప్రారంభమవడంతో అందరిలో కొత్త ఉత్సాహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీ ఆశావహంలో ఉన్నారు. ప్రభుత్వం తరఫున భారీ ప్రయోజనాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించి కీలక విషయం తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం మూడు బహుమతులు లభించనున్నాయని తెలుస్తోంది. అవేమిటో తెలుసుకుందాం.
2/7లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ప్రభుత్వం నుంచి మూడు అంశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బహుమతులలో 8వ వేతన సంఘం, కరువు భత్యం, డీఆర్ పెంపు, దీపావళి బోనస్ ఉన్నాయి.
3/7ఈ మూడు అంశాలపై ప్రభుత్వం ప్రకటన చేస్తే లక్షలాది మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం దక్కనుంది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ ధరలను తగ్గించి ప్రజలకు ఒక కానుక ఇవ్వగా.. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించేలా ఒక ప్రకటన చేస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.
4/7అక్టోబర్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏలో 3 శాతం పెరుగుదలతోపాటు దీపావళి బోనస్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దీపావళి వరకు ఈ ప్రకటనలు చేస్తే లక్షలాది ఉద్యోగులు, పింఛన్‌దారులు ప్రయోజనం పొందుతారు.
5/7అక్టోబర్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏలో 3 శాతం పెరుగుదలతోపాటు దీపావళి బోనస్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దీపావళి వరకు ఈ ప్రకటనలు చేస్తే లక్షలాది ఉద్యోగులు, పింఛన్‌దారులు ప్రయోజనం పొందుతారు.
6/7వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలు, పెన్షన్లను గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. వేతన సంఘానికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) అక్టోబర్ 2025లో జారీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 నుంచి 34 శాతం జీతాల పెంపు లభించవచ్చని అంచనా.
7/7ఫిట్‌మెంట్ కారకం 1.83 నుంచి 2.46 వరకు ఉండవచ్చు. దీపావళి సమయంలో అక్టోబర్‌లో డీఏ, డీఆర్‌లో 3 శాతం పెరుగుదల ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 2025 నుంచి డీఏ ఇప్పటికే 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. ఇప్పుడు జూలై-డిసెంబర్ 2025కి ఇది 55 శాతం నుంచి 58 శాతానికి పెరగవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన అక్టోబర్ మధ్య నాటికి వెలువడే అవకాశం ఉంది.