8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ అమలుపై ఆందోళనలు మొదలయ్యాయి ముఖ్యంగా అమలు కావడానికి మరో మూడేళ్లు వేచి ఉండాల్సిందేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
1/5కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ 2025 ప్రారంభంలోనే ప్రకటించింది. కానీ ఇప్పటివరకు కమిషన్ అధికారిక నోటిఫికేషన్, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, సభ్యుల నియామకం జరగలేదు. అందుకే అటు యూనియన్లలో ఇటు ఉద్యోగులలో ఆందోళనలు మొదలయ్యాయి. చాలామందికి ఇప్పుడు ఒకటే ప్రశ్న. అసలు ఈ ఎనిమిదవ పే కమిషన్ అమలుకు మరో మూడేళ్లు వేచి ఉండాల్సిందేనా అని.
2/5ఈ 2028 సంవత్సర ప్రశ్న ఎందుకు వచ్చింది అనే విషయానికొస్తే.. ఇంతవరకు జరిగిన పే కమిషన్ల అనుభవమే అని చెప్పాలి. ఏ పే కమిషన్ చూసినా.. ఏర్పాటు నుంచి అమలుకు దాదాపు రెండు నుండి మూడు సంవత్సరాల సమయం పడుతూ వచ్చింది. అదేవిధంగా ఈసారి కూడా అదే జరిగితే మరో మూడేళ్లు వేచి ఉండాల్సిందే అంటూ ఉద్యోగులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
3/5నిజానికి ఆరవ పే కమిషన్ ని చూసుకుంటే.. 2006 అక్టోబర్లో ఏర్పాటయింది. కానీ 2008 మార్చిలో కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించగా.. 2008 ఆగస్టులో ప్రభుత్వం ఈ రిపోర్టును ఆమోదించింది. మొత్తం 22 నుంచి 24 నెలల గడువు సమయం పట్టింది.
4/5అలాగే ఏడవ పే కమిషన్ 2014 ఫిబ్రవరిలో ఏర్పడింది.. మార్చిలో టి ఓ ఆర్ ఫైనల్ అయింది. కానీ 2015 నవంబర్లో రిపోర్టు వచ్చింది. 2016 జూన్ లో ప్రభుత్వం ఆమోదించి, జనవరి ఒకటి నుండి అమలు చేసింది. మొత్తం 33 నెలలు పట్టింది. దీన్ని బట్టి చూస్తే గతంలో రెండు పే కమిషన్లు సగటున రెండు నుండి మూడు సంవత్సరాల సమయం పడుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు 8వ పే కమిషన్ గురించి తాజా పరిస్థితి చూస్తే 2025 జనవరి 16న ప్రకటన వచ్చింది. కాబట్టి టి ఓ ఆర్ ఇంకా రాలేదు. పైగా సభ్యుల నియామకం కూడా జరగలేదు. కమిషన్ వచ్చే నెలలో ఏర్పడినట్లయితే రిపోర్టు సిద్ధం చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. అయితే 2027 నాటికి పూర్తవుతుంది.
5/5ఇక వచ్చిన ఆ రిపోర్టును ప్రభుత్వం పరిశీలించి, సవరించి, ఆమోదించడానికి సమయం పడుతుంది. అందుకే 2028లో అమలు కావచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.