Dharmendra Net Worth: 100 ఎకరాల ఫార్మ్‌హౌస్‌ నుంచి కోట్ల ఆస్తులు వరకు..ధర్మేంద్ర ఆస్తుల వివరాలు ఇవే..

Dharmendra Assets
బాలీవుడ్‌లో “హీమాన్” అని పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇక లేరు అని వార్తను తెగ వైరల్ అయ్యాయి. ఆయన 89 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు అంటూ మీడియాలో ప్రచారం అయింది. చాలాకాలంగా వయసుతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అభిమానులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎంతో ఆవేదనతో స్మరించుకుంటున్నారు. కానీ ఇవన్నీ అబద్ధాలు అంటూ కూతురు ధ్రువీకరించింది..

1 /5

ధర్మేంద్ర ఇంకా బతికే ఉన్నారు అని హాస్పిటల్ లో కోరుకుంటూ ఉన్నారని.. చెప్పుకొచ్చింది ఆయన కూతురు ఈషా. ఈ క్రమంలో ఆయన ఆస్తుల వివరాలు కూడా వైరల్ అవుతూ. ధర్మేంద్ర తన సినీ ప్రయాణాన్ని ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో ప్రారంభించారు. ఈ చిత్రానికి ఆయనకు 100 రూపాయల పారితోషికం కూడా రాలేదు. ఒక రియాలిటీ షోలో ఆయన స్వయంగా చెప్పినట్లుగా, ఆ సమయంలో దర్శకుడు ఆయనకు కేవలం 17 రూపాయల చొప్పున ఇచ్చాడు. అయితే ఆ మొత్తం తనకు అదృష్టసూచకం అని ఆయన అన్నారు.

2 /5

అయితే ఈ సాధారణ ఆరంభం తర్వాత ధర్మేంద్ర తన ప్రతిభతో బాలీవుడ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించారు. ఆయన 300కి పైగా సినిమాల్లో నటించి కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టారు. తన కెరీర్‌లో 60వ దశకంలో మొదలుకొని 90ల వరకు సూపర్ స్టార్‌గా కొనసాగారు. ఆయన అందం, వ్యక్తిత్వం, నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. దిలీప్‌కుమార్..దేవ్ ఆనంద్ వంటి లెజెండరీ నటులు కూడా ధర్మేంద్రను చూసి ముచ్చటపడ్డారని పాత ఇంటర్వ్యూల్లో చెప్పారు.  

3 /5

కొన్ని మీడియా మాధ్యమాల సమాచారం ప్రకారం, ఆయన వద్ద సుమారు 450 కోట్ల రూపాయల ఆస్తి ఉందని తెలుస్తోంది. ఇందులో 100 ఎకరాల ఫార్మ్‌హౌస్‌, 12 ఎకరాల రిసార్ట్‌, విలాసవంతమైన కార్లు, ఇళ్లు ఉన్నాయి. అలాగే, ఆయన “గరం ధరం ఢాబా” అనే రెస్టారెంట్‌ ద్వారా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. తరువాత “హీమాన్” పేరుతో మరో రెస్టారెంట్‌ను కర్ణాల్ హైవేపై ప్రారంభించారు.  

4 /5

అతని వద్ద మహారాష్ట్రలో 17 కోట్ల విలువైన ఆస్తులు, అలాగే వ్యవసాయ.. వ్యవసాయేతర భూముల్లో పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.

5 /5

ధర్మేంద్ర వ్యక్తిగత జీవితంలో రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య ప్రకాశ్ కౌర్ నుంచి ఆయనకు నలుగురు పిల్లలు .. సన్నీ దియోల్, బాబీ దియోల్, అజేతా, విజేత. తర్వాత ఆయన నటీమణి హేమామాలినిని ప్రేమించి రెండోసారి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన జీవితాన్ని కష్టాలతో ప్రారంభించి విజయాలతో ముగించిన ధర్మేంద్ర పేరు ఎప్పటికీ భారత సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఆయన.. బతికే ఉన్నారు అన్న వార్త అందరిలో సంతోషం నెలకొల్పింది..