Aadhaar Fees Increase From October 1: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలెర్ట్ ప్రకటించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అక్టోబర్ 1 నుంచి సర్వీస్ ఫీజు పెంచింది. అధికారికంగా ఎక్స్ వేధికగా ఇప్పటికే ప్రకటించారు. ఆధార్ కార్డులో మీ పేరు, ఇంటి నంబర్, ఫోన్ నంబర్, ఫోటో వంటివి మార్పులు చేసుకోవాలంటే ఇకపై ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
1/5ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే గతంలో రూ.50 ఉన్న సర్వీస్ ఫీజు రూ.75 కు పెంచింది యూడీఏఐ. అదే విధంగా రూ.100 సర్వీస్ ఫీజు ని రూ.125 కు సెకండ్ ఫేజ్‌లో పెంచనుంది. రూ. 75 ఉన్న ఫీజును రూ.90 పెంచింది. రూ. 125 సర్వీస్ ఫీజును రూ.150కి పెంచింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
2/5ఈ పెరిగిన ఆధార్ సర్వీస్ ఫీజులు 2025 అక్టోబర్ 1 నుంచి 2028 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తాయి. ఇక సెకండ్ పేజ్ లో అక్టోబర్ 2028 అక్టోబర్ 1 నుంచి 2031 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. అయితే కొత్తగా ఆధార్ నమోదుకు మాత్రం ఉచితంగా సర్వీస్ పొందవచ్చు. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.
3/5దీంతోపాటు ఏడేళ్ల లోపు ఉన్న పిల్లలకు.. 17 ఏళ్లలోపు ఉన్న టీనేజర్స్ కూడా బయోమెట్రిక్ ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు .. కానీ ఏడేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సిందే. ఇది రూ.100 నుంచి రూ.125 మధ్య ఫస్ట్ ఫేజ్‌లో ఉంటుంది. ఆ తర్వాత రూ.150 సెకండ్ ఫేజ్ uidai అధికారిక వెబ్సైట్లో ఈ ఫీజు రూ.50 నుంచి రూ.75 కు పెరిగింది.
4/5అధికారిక వెబ్సైట్లో కూడా ఈ సర్వీస్ లో ఫీజు సవరణ చేసింది. ఆధార్ కార్డు పై ఫోటో, పేరు, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ మార్పులు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ పెరిగిన సర్వీసు ఫీజు అక్టోబర్ 1 నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
5/5ఆధార్ కార్డు అనేది మన దేశంలో ఒక గుర్తింపు కార్డు. ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిందే. స్కూల్ అడ్మిషన్ నుంచి ఏ స్కాలర్షిప్ పొందాలి అన్న కానీ సాధారణంగా బ్యాంకు లావాదేవీలకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. చిన్న పిల్లలనుంచి పెద్దల వరకు ఆధార్ కార్డు ప్రతి పథకానికి తప్పకుండా ఉండాల్సిందే.