Add Zee Business As A Preferred Source
App

Aadhaar Card: ఆధార్‌ కార్డు 10 ఏళ్లు పాతదా? ఈ తేదీ వరకు ఉచితంగా అప్‌డేట్‌ చేయండి..

Written ByRenuka Godugu
Published: Sep 16, 2025, 09:10 AM IST|Updated: Sep 16, 2025, 09:10 AM IST

Aadhaar Card Update: మనదేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు. అందుకే ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సిందే. ఈ దేశంలో ఏ పథకాలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ బ్యాంకుల లావాదేవీల్లో కూడా ఇది తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలి. ఆధార్ కార్డు అప్‌డేట్ ఉచితంగా అందుబాటులో ఉంది. పదేళ్లు పైబడిన ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి.
 

Guidelines1/5

గైడ్‌ లైన్స్

 పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే యుఐడిఎఐ సౌకర్యం కల్పించింది. కొన్ని గైడ్‌ లైన్స్ అనుసరించి సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు పదేళ్లు పాతబడింది అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు పడతారు.  

Identity Proof2/5

ఐడెంటిటీ ప్రూఫ్

 ప్రధానంగా ఆధార్ కార్డుతో అన్ని పథకాలు ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ బెనిఫిట్స్ పొందాలి అన్న ఆధార్ కార్డు తప్పనిసరి. అంతేకాదు ఆధార్ కార్డు స్కూల్ నుంచి కాలేజీ అడ్మిషన్ వరకు కచ్చితంగా కలిగి ఉండాల్సిందే. ఇది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయింది.  

Aadhaar Card3/5

ఆధార్ కార్డు

 2026 జూన్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో మీరు అడ్రస్ కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.  ఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనే సులభంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యం ఉంది.  

Aadhaar4/5

ఆధార్‌

ఆధార్‌ సేవా కేంద్రాలకు వెళ్లి కూడా మీరు నామమాత్రంగా రూ.50 చెల్లించి సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్, ఐరిష్ స్కాన్ చేసి అప్‌డేట్ చేస్తారు. పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఐదేళ్లు 15 ఏళ్ల రెండుసార్లు ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకోవాలి.  

UIDAI5/5

యూఐడీఏఐ

యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్లో లాగిన్ అయి ఓటిపి వస్తుంది. దాని నమోదు చేసి మీ వివరాలు ఎంటర్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేసే స్కాన్ చేయాలి. ఆ తర్వాత సులభంగా అది యాక్సెస్ చేసి 14 డిజిట్ అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ కూడా పంపిస్తుంది. ఆ తర్వాత మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.