Pawan Wife : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటుడు పవన్. ఇప్పుడు ఆయన భార్య మరో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఈసారి పుట్టిన బిడ్డ ఎవరు అన్న విషయానికి వెళితే..
బుల్లితెరపై తమ నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అంజలి..మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆమె జీవితంలో మరో మధుర ఘట్టం మొదలైంది. ప్రముఖ టీవీ నటుడు పవన్‌తో 2017లో ప్రేమ వివాహం చేసుకున్న అంజలి, ఇప్పటికే ఒక కుమార్తెకు తల్లిగా ఉన్నారు. ఇప్పుడు ఆమె రెండోసారి తల్లిగా మారారు.
‘మొగలిరేకులు’, ‘రాధా కళ్యాణం’, ‘దేవత’, ‘శివరంజని’ వంటి సీరియల్స్ ద్వారా అంజలి బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె నటనకు ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్ద ఎత్తున స్పందించారు. పవన్‌తో కలిసి ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడుపుతూ, అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.
తాజాగా, అంజలి మరోసారి తల్లి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “ఫుల్ వీడియో కమింగ్ సూన్ విత్ చందమామ” అంటూ తన రెండో బిడ్డకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. అయితే పుట్టిన బిడ్డ పాపా లేదా బాబా అన్న విషయం వెల్లడించలేదు.
ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంజలి కుటుంబంలో వచ్చిన ఈ కొత్త ఆనందం పట్ల ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు సెలెబ్రిటీలు కామెంట్స్ చేయగా, అభిమానులు కూడా ప్రేమతో కూడిన సందేశాలను పంపిస్తున్నారు. బుల్లితెరపై నవ జీవితాన్ని ప్రారంభించిన అంజలి, నిజ జీవితంలో రెండోసారి తల్లి కావడం అభిమానులకు ఆనందకరంగా మారింది.