Actor Vishal Health News: స్టేజీ మీద కుప్పకూలీన హీరో విశాల్.. హెల్త్‌పై కీలక ప్రకటన చేసిన పీఆర్ టీమ్..

Actor vishal collapsed on stage: తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హీరో విశాల్ వచ్చారు. అయితే.. ఆయన స్టేజ్ మీద  ఒక్కసారిగా కుప్పకూలీపోయారు. ఈ క్రమంలో ఆయనను వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
 

1 /5

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఆలయచిత్తిరై ఉత్సవాలలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా హీరో విశాల్ హజరయ్యారు.  ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్ల కోసం ‘మిస్‌ కూవాగం 2025’ అందాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ హజరైన నేపథ్యంలో అనుకొన ఘటన చోటు చేసుకుంది.  

2 /5

కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ ఒక్క‌సారిగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో అక్కడున్న సిబ్బంది వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో హీరో విశాల్ పడిపోయాడనగానే ఆయన అభిమానులు ఏమైందో అని ఎమోషనల్ అయ్యారు.  

3 /5

ఈ క్రమంలో.. విశాల్ ఆరోగ్యంపై ఆయ‌న పీఆర్ టీమ్ కీలక ప్రకటన చేశారు. " హీరో విశాల్ హెల్త్ బాగానే ఉందని చెప్పారు. అయితే.. ఆయన నిన్న మధ్యాహ్నం భోజనం చేయకపొవడం వల్ల ఒక్కసారిగా.. స్పృహ కోల్పోయారన్నారు  

4 /5

కేవలం జ్యూస్ తీసుకొవడం వల్ల వేదిక మీద కళ్లు తిరిగి పడిపోయాన్నారు. అంతకు మించి ఆయనకు ఏమి కాలేదని.. కొంతమంది ఆయనకు ఏవేవో జబ్బులు అంటకడుతున్నారని.. ఇవన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేశారు.  

5 /5

విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించిన విషయం వెల్లడించారు. ఇక మీదట ఆహారం తీసుకొవడంలో నెగ్లీజెన్సీగా ఉండొద్దని వైద్యులు చెప్పినట్లు పీఆర్ టీమ్ స్పష్టం చేశారు.