Tollywood Heroines: ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఎవరు అంటే తెలుగులో త్రిష, శ్రీయ పేర్లు వినిపించేవి. కానీ ఒక స్టార్ హీరోయిన్ చేసిన తప్పు వల్ల వీరిద్దరూ టాప్ వన్ ప్లేస్ ఆక్రమించుకున్నారు. లేకపోతే వారి ప్లేస్ లో మరో హీరోయిన్ ఉండాల్సింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయం ఒకసారి చూద్దాం..
తెలుగు చిత్రసీమలో ప్రతి దశాబ్దంలో కొందరు హీరోయిన్లు వెలుగొంది టాప్ పొజిషన్‌లో ఉంటారు. త్రిష, శ్రీయ శరన్, నయనతార, కాజల్ అగర్వాల్ లాంటి నాయికలతో పాటు ఆర్తి అగర్వాల్ కూడా ఒక వెలుగు వెలిగింది. "నువ్వు నాకు నచ్చావ్" సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, కొంతకాలంలోనే ఎన్నో విజయాలు సాధించింది.
ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం పొందింది. "ఇంద్ర" సినిమా ఆమెకు తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అలాగే, విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన "నువ్వు నాకు నచ్చావ్," "వసంతం," "సంక్రాంతి" వంటి సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. నాగార్జునతో ఆమె "నేనున్నాను" సినిమాలో నటించింది.
టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో పాటు కమెడియన్‌గా వెలుగొందిన సునీల్‌తో కూడా ఆర్తి అగర్వాల్ నటించింది. "అందాల రాముడు" అనే సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఆమె కెరీర్‌లో ప్రత్యేకమైన మూవీగా నిలిచింది. ఆర్తి అగర్వాల్ అప్పట్లో గ్లామర్ పరంగా కూడా ఎంతో అందంగా ఉండేది. శ్రీయ, త్రిష కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించింది. ఆమెపై యూత్‌లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. కానీ, ఈ స్థాయి లోలాగే కొనసాగించలేకపోయింది.
ఆర్తి అగర్వాల్ కెరీర్‌కి ఆటంకాలు వచ్చిన ప్రధాన కారణాల్లో ఒకటి హీరో తరుణ్‌తో ప్రేమ వ్యవహారం. ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. క్రమంగా బరువు పెరిగిన ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి.
బరువు తగ్గేందుకు ఆమె ఓ సర్జరీ చేయించుకోగా, అది వికటించడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా మారి 31 ఏళ్ల వయసులోనే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఆర్తి అగర్వాల్ టాలీవుడ్‌లో మెరుపులా మెరిసి మాయమైన నటి. ఆమె చేసిన కొన్ని తప్పులు లేకుంటే, ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచుండేదని అనిపిస్తుంది. ఏదేమైనా, ఆమె సినిమాలు, అభినయం ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి.