Aditi Rao Hydari Pics: కోహినూర్ డైమండ్‌లా మెరిసిపోతున్న అదితిరావు హైదరీ!

Fri, 22 Apr 2022-8:48 pm,

అదితిరావు సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటారు. సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఫోటోలలో అదితి కోహినూర్ డైమండ్‌లా కనిపిస్తున్నారు. 

అదితిరావు హైదరీకి తెలుగు సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. 'సమ్మోహనం' మినహా మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. దాంతో అదితి మంచి బ్రేక్ కోసం చుస్తున్నారు. 

అదితిరావు హైదరీ చివరగా నటించిన చిత్రం మహా సముద్రం. శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. 

తెలుగులో అదితిరావు హైదరీ సమ్మోహనం, అంతరిక్షం, సైకో, వీ సినిమాలలో నటించారు. 

సుదీర్ బాబు హీరోగా వచ్చిన సమ్మోహనం సినిమాతో అదితిరావు హైదరీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అదితిరావు హైదరీకి తెలుగుమ్మాయి అనే మూలాలు ఉన్నప్పటికీ.. ఫేస్‌లో ఇన్నోసెన్స్, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల మదిలో మాత్రం ముంబై హీరోయిన్‌గానే రిజిస్ట్రర్ అయింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link