Actress Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్.. తెలుగులో ఈ హీరోయిన్ చేసింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో ప్రేక్షకులకు ఫేవరేట్‌గా మారిపోయింది. అయితే అందం, అభినయం ఉన్న ఈ భామకు.. లక్ కలిసి రాలేదనే చెప్పొచ్చు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సరసన నటించిన కూడా.. రావాల్సిన బ్రేక్ మాత్రం అను ఇమ్మాన్యుయేల్‌కి రాలేదు. తాజాగా ఈ అమ్మడు చీరలో కుందనపు బొమ్మలా రెడీ అయి.. పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
1/5నాని హీరోగా నటించిన ‘మజ్ను’ మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లను దక్కించుకున్నప్పటికీ.. ఈ భామ నటించిన సినిమాలేవి అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. అయినప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది అను ఇమ్మాన్యుయేల్.
2/5ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. దాంతో సోషల్ మీడియాలోనే ఎక్కువ టైమ్ గడుపుతుంది. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ చీరలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్యూటిఫుల్, వావ్ చీరలో చందమామలా ఉన్నావంటూ అను ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
3/5ఇక అను ఇమ్మాన్యుయేల్ తండ్రి తంకచన్ ఇమ్మాన్యుయేల్.. ఈయన ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత. చిన్నతనంలోనే యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ పెంచుకున్న అను, తన సినీ ప్రస్థానాన్ని బాలనటిగా మొదలుపెట్టింది. అను తొలిసారిగా 2011లో "స్వప్న సంచారి" అనే మలయాళ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది.
4/5తెలుగులో నాని మజ్ను మూవీ తర్వాత.. పవన్ కళ్యాణ్‌తో "అజ్ఞాతవాసి", అల్లు అర్జున్‌తో "నా పేరు సూర్య" వంటి తెలుగు చిత్రాలలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. అయితే ఈ సినిమాలేవి ఆశించిన విజయం సాధించకపోవడంతో.. సరైనా హిట్టు కోసం
5/5సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అను ఇమ్మాన్యుయేల్. నిత్యం తన ఫొటోలతో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ కలువ కళ్ల సుందరి.