Anushka Shetty shocking decision: సూపర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి. తన ఫస్ట్ సినిమాతోనే అందరినీ ఇంప్రెస్ చేసిన అనుష్క.. ఆ తర్వాత అరుంధతి మూవీతో ఓవర్‌నైట్ సూపర్‌స్టార్‌గా మారిపోయి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. అనుష్క పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
1/6అనుష్క శెట్టి.. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ్‌లో ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో పనిచేసి.. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించింది. హీరోలతో సంబంధం లేకుండా అనుష్క ఉంటే చాలు థియేటర్‌కి వెళ్లొచ్చు అనేలా.. ప్రేక్షకులను తన సినిమాలకు రప్పించుకుంది. కానీ ఏమైందో ఏమో బాహుబలి, భాగమతి సినిమా తర్వాత ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమయింది.
2/6ఈ మధ్య కాలంలో ఒకటి, రెండు సినిమాలకే పరిమితమైన అనుష్క బయట ఎక్కడ కూడా కనిపించడం లేదు. అయితే ఇటీవల ఘాటీ అనే సినిమాతో వచ్చింది అనుష్క. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అసలు ఆ సినిమా ప్రమోషన్స్‌కి అనుష్క బయటకు రాలేదు. కనీసం ఏదైనా ఇంటర్వ్యూలు చేసి రిలీజ్ చేసారంటే అది కూడా లేదు. అసలు ఘాటీ ప్రమోషన్స్‌లో ఎక్కడా అనుష్క ముఖమే కనిపించలేదు.
3/6ఇక రీసెంట్‌గా జరిగిన బాహుబలి రీయూనియన్‌లో కూడా అనుష్క కనిపించకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే ఘాటీ మూవీ ఫ్లాప్‌తోనే అభిమానులు చాలా డిసప్పాయింట్ అయితే... అనుష్క ఈరోజు సోషల్ మీడియా వేదికగా మరో విషయాన్ని షేర్ చేసుకుంది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
4/6తన చేతి రాతతో సోషల్ మీడియాలో అనుష్క ఇలా పోస్ట్ పెట్టింది. బ్లూ లైట్ నుండి క్యాండిల్ లైట్‌కి.. నేను సోషల్ మీడియా నుండి కొంత కాలం బ్రేక్ తీసుకుంటున్నాను.
5/6నేను వర్క్ కాకుండా ఎక్కడైతే మనమందరం స్టార్ట్ అయ్యామో ఆ ప్రపంచంతో రీకనెక్ట్ అవ్వడానికి వెళ్తున్నాను. త్వరలో మీ ముందుకు మరిన్ని కథలతో మరింత ప్రేమతో వస్తాను అని అనుష్క తెలిపింది. ఆల్వేస్ ఫర్ ఎవర్ .. స్మైల్ ఆల్వేస్.. అనుష్క శెట్టి అంటూ పోస్ట్ చేసింది.
6/6అసలైతే అనుష్క శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే చాలా రేర్. ఇప్పుడు అది కూడా లేకుండా ఆమె సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం.. అనుష్క ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేసినప్పటికీ.. తమ ఫేవరేట్ నటి మళ్లీ స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.