Heroine Aparna Balamurali: అపర్ణ బాలమురళి.. ఈ న్యాచురల్ బ్యూటీ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆకాశమే హద్దుగా సాగిపో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది హీరోయిన్ అపర్ణ బాలమురళి. ఆ తర్వాత ధనుష్ హీరోగా చేసిన రాయన్ సినిమాలో సందీప్ కిషన్‌కి జోడీగా తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఓ ఇంటర్వూలో అపర్ణ.. తనకు జరిగిన బ్యాడ్ మూమెంట్స్‌పై ఓపెన్ అయింది.
1/5నటి అపర్ణ బాలమురళి తన కొత్త సినిమా మిరాజ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా ఆసిఫ్ అలీ నటిస్తుండగా.. సెప్టెంబర్ 19న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అపర్ణ.. గతంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
2/5కొంతకాలంగా నా గురించి కొంత మంది ఏదేదో మాట్లాడుతున్నారు.. ఇలా అయిపోయావేంటి అంటూ నా ముఖం మీదే దారుణంగా వాగుతున్నారు. అయితే మొదట్లో ఇదంతా చూసి చాలా బాధపడేదాన్ని, డిప్రెషన్‌కి కూడా వెళ్లిపోయేదాన్నంటూ ఎమోషనల్ అయింది అపర్ణ.
3/5ఓసారైతే నేను చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఓ ఎయిర్‌పోర్టులో దిగాను. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా ఓ వ్యక్తి నాకు ఎదురొచ్చి.. ఏంటి ఇంతా లావయ్యావంటూ నా ఫేస్ పైనే నీచంగా మాట్లాడాడు. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు.
4/5అందరూ చూస్తుండగా అతను అలా అనేసరికి నాకు ఏం చేయాలో కూడా తోచలేదు. అలానే షాక్‌లో ఉండిపోయి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది.
5/5అవతలి వ్యక్తి ఏ పరిస్థితుల్లో అలా అయ్యారనే దానిపై కాస్త కూడా అవగాహన లేకుండా అలా ఇష్టానుసారంగా మాట్లాడటం చాలా తప్పు. ఒకప్పుడు అయితే ఇలాంటి మాటలను అసలు తట్టుకోలేకపోయేదాన్ని..కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా స్ట్రాంగ్‌గా మారిపోయాను. నెగెటివ్ కామెంట్స్‌ను అసలు పట్టించుకోవడం లేదంటూ అపర్ణ చెప్పుకొచ్చింది.