Add Zee Business As A Preferred Source
App

Genelia: 6 వారాల్లో 4 కేజీలు తగ్గిన జెనీలియా.. సీక్రెట్ ఏమిటంటే..

Written ByVishnupriya
Published: Sep 17, 2025, 12:20 PM IST|Updated: Sep 17, 2025, 12:20 PM IST

Genelia Weight Loss: ఎన్నో రోజులపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది జెనీలియా. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనింది. అయితే అప్పట్లో జెనీలియా కొద్దిగా లావైన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత ఏకంగా ఆరు వారాల్లో నాలుగు కేజీలు తగ్గే అందరిని ఆశ్చర్యపరిచింది..

Genelia Weight Loss Secret1/5

జెనీలియా ఫిట్‌నెస్ సీక్రెట్

బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి జెనీలియా దేశ్‌ముఖ్..పెళ్లి అయిన తర్వాత కూడా తన అందం, ఉత్సాహంతో.. ఈ మధ్యనే జూనియర్ సినిమాతో..కం బ్యాక్ ఇచ్చి దూసుకుపోతోంది. 

Genelia Fitness Secret 2/5

జెనీలియా ఫిట్‌నెస్ సీక్రెట్

ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ..ఆమె లావు పెరిగిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం. అయితే ఈ హీరోయిన్ పిల్లల్ని కన్న తర్వాత ప్రతిరోజు లావుగానే ఉండింది. కానీ ఆ తర్వాత.. 6 వారాల్లో నాలుగు కేజీలు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇక అప్పుడు అంతలా తగ్గడానికి.. అలానే ఆ తరువాత అదే మెయింటైన్ చేయడానికి జెనీలియా ఫాలో అయిన రహస్యం ఏమిటి అనేది ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది. 

Genelia Weight Loss in 6 Weeks3/5

జెనీలియా ఫిట్‌నెస్ సీక్రెట్

జెనీలియా రోజు తన ఉదయాన్నే వేడి నీళ్లతో ప్రారంభిస్తుంది అంట. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అలానే..ఆమె ప్రతిరోజూ వాకింగ్, జాగింగ్ చేయడమే కాకుండా, అవసరమైతే జిమ్‌కు కూడా వెళ్తుంది. అయితే జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని.. రోజు డాన్స్ వేసిన కానీ తగ్గుతామని చెప్పుకొచ్చింది జెనీలియా. ఇలా వ్యాయామాన్ని తన జీవనశైలిలో భాగం.. చేసుకోవడం వల్లే ఆరోగ్యంగా, ఫిట్‌గా ముందగలుగుతున్నానని తెలిపింది.

Genelia Diet Plan 4/5

జెనీలియా ఫిట్‌నెస్ సీక్రెట్

ఆహారపు అలవాట్లలో కూడా జెనీలియాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకు తండ్రి. ఒకేసారి ఎక్కువగా తినకుండా.. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు చిన్న చిన్న భోజనాలు తీసుకోవడం ఆమె అలవాటు అని తెలిపింది. ఉదయం అల్పాహారంలో దోశ, ఇడ్లీ, ఉప్పిట్టు వంటి దక్షిణ భారత టిఫిన్స్ తీసుకుంటానని.. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని చెప్పుకొచ్చింది.  

Genelia Daily Diet5/5

జెనీలియా ఫిట్‌నెస్ సీక్రెట్

తరచుగా నీరు తాగడం కూడా ఆమె రహస్యమంట. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం ద్వారా శరీరంలో హైడ్రేషన్ పెరిగి.. బరువు తగ్గడం సులభమవుతుందని ఆమె చెబుతుంది. మొత్తానికి..మితమైన డైట్, క్రమం తప్పని వ్యాయామం, సమయానికి భోజనం చేయడం వంటి అలవాట్ల వల్లే జెనీలియా తక్కువ సమయంలోనే బరువు తగ్గగలిగింది.