Janhvi Kapoor: కేన్స్‌ ఫెస్టివల్లో మెరిసిన జాన్వీ పాప.. ఈ డ్రెస్‌లో భలే ఉంది మావా!

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీకపూర్..ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. తన లుక్ తో ప్రపంచమంతా తనవైపే తిప్పుకుంది. జాన్వీ ధరించిన డ్రెస్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 
 

1 /6

Janhvi Kapoor: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్..ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలన చిత్రాల్లో ఒకటి. గతవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. విశ్వవ్యాప్తంగా పేరెన్నికగన్న నటీనటులు హాజరై ఈ కార్యక్రమానికి కొత్త శోభ తీసుకువస్తున్నారు.   

2 /6

హాలీవుడ్ నుంచి ఎంతో మంది టాప్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ నటీనటులు కూడా ఆ వేదికను మరింత కలర్ ఫుల్ గా మారుస్తున్నారు.   

3 /6

తాజాగా మంగళవారం శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్, ఇషన్ కట్టర్ జంటగా నటించిన హోమ్బాండ్ మూవీ ప్రీమియర్ కోసం జాన్వీ కేన్స్ లో మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చింది. 

4 /6

ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ ప్రీ డ్రేప్డ్ సారీతో జాన్వీ రెడ్ కార్పెట్ పై నడిచి అందర్నీ ఆకట్టుకుంది.   

5 /6

జాన్వీ పాప కారు దిగినప్పటి నుంచి వేలాది కెమెరాలు ఆమె చుట్టూనే తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ పడ్డాయి.   

6 /6

జాన్వీకి  సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరో నాలుగు రోజుల పాటు అంటే మే 24వ తేదీ వరకు ఈ కేన్స్ ఉత్సవం జరుగుతుంది.