Janhvi Kapoor About Her marriage: తన పెళ్లి గురించి కొంతకాలంగా వస్తున్న రూమర్స్ పై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ క్రమంలో అసలు విషయంను బైటపెట్టడంతో అందరు తెల్లముఖం వేశారు.
1/6కొన్నిరోజులుగా శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్ తరచుగా వార్తలలో ఉంటున్నారు.ఈ హీరోయిన్ తనకు వీలు చిక్కినప్పుడల్లా తిరుమలకు వెళ్తుంటారు.తన ఫెవరెట్ గాడ్ శ్రీవెంకటేశ్వర స్వామి అని,అక్కడే పెళ్లి చేసుకొవాలని ఉందని, ముగ్గురు పిల్లల్ని కూడా కనాలని ఉందని ఇప్పటికే తమ మనసులోనిమాటల్నిబైటపెట్టింది.
2/6అయితే.. గత కొన్ని నెలలుగా జాన్వీ కపూర్ పెళ్లి గురించి తరచుగా ఏదో ఒక రూమర్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.తాజాగా.. నటి జాన్వీకు, శిఖర్ పహారియాతో తన పెళ్లి అంటూ ప్రచారం పీక్స్ కు చేరింది. దీనిపై ఒక్కమాటలో అందరికి బిగ్ షాక్ ఇచ్చారు.
3/6జాన్వీకపూర్ ప్రస్తుతం.. వరుణ్ ధావన్‌తో కలిసి జాన్వీ నటిస్తున్న ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ నేపథ్యంలో.. మీడియా ప్రతినిధులు ఆమెను "మీ పెళ్లి ఎప్పుడు?" అని నేరుగా ప్రశ్నించారు.
4/6ఈ క్రమంలో జాన్వీ మాత్రం.. తన ఫోకస్ మొత్తం కెరిర్ పైనే ఉందని, పెళ్లికి ఇంకా సమయం ఉందని కూడా తడుముకోకుండా చెప్పేసింది. అంతే కాకుండా.. తన పెళ్లికి ఇంకా టైమ్ ఉందని జాన్వీపాప తెల్చి చెప్పింది. అంతేకాకుండా.. జాన్వీకపూర్ తనపెళ్లిపై తొలిసారి నేరుగా రియాక్ట్ అయ్యిఈ విధంగా ఆన్సర్ చేయడం కూడా అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తుంది.
5/6మరోవైపు.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
6/6స్పీడ్ డయల్ లో.. బోనీకపూర్, ఖుషీ తర్వాత.. శిఖర్ పేరు ఉందని చెప్పింది. శిఖు అని పేరున్న నెక్లెస్ ధరించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. ఇది పక్కన పెడితే.. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.