Bigg Boss Beauty : తెలుగు బుల్లితెరలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్యశ్రీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి. బెంగళూరులో జన్మించిన ఆమె మొదటగా కన్నడ సీరియల్స్ నీలి.. నాయకి..మహాకాళి వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
1/5ఆ తర్వాత తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, గోరింటాకు, అమ్మకి తెలియని కోయిలమ్మ, గువ్వా గోరింకా వంటి సీరియల్స్‌తో మంచి పేరును సంపాదించారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారన్న.. వార్తలు వినిపిస్తున్నాయి.
2/5కావ్యశ్రీకి గోరింటాకు సీరియల్‌లో నటుడు నిఖిల్ మలియాక్కల్ పరిచయం అయి..అది ప్రేమగా మారింది. వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో కలిసి కనిపించేవారు. కానీ..కొంతకాలానికే వీరి మధ్య దూరం ఏర్పడింది. తరువాత నిఖిల్ సోషల్ మీడియాలో "ప్రతి ఒక్కరి జీవితం వాళ్లదే, నన్ను ఎవరి పోస్టులకు ట్యాగ్ చేయొద్దు" అని పోస్ట్ చేయడంతో వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు అభిమానులు అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా కొంతమంది కావ్య.. సీరియల్ హీరో నిఖిల్ కి మోసం చేసిందా అంటూ కూడా కామెంట్లు పెట్టారు.
3/5ఈ క్రమంలో..శ్రీముఖి హోస్ట్‌గా చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో కావ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “నాకు ఇప్పటికి పెళ్లి చేసుకోవాలని లేదు, సింగిల్‌గా ఉండిపోవాలనిపిస్తుంది” అని ఆమె చెప్పడంతో శ్రీముఖి “ఇంత అందం వేస్ట్ అయిపోకూడదు” అంటూ సరదాగా మాట్లాడింది. ఆ వెంటనే ఓ నటుడు “మీరు సింగిల్‌గా ఉంటే మా లాంటి వాళ్లు సుయిసైడ్ చేసుకోవాలి” అని చెప్పడంతో స్టేజ్‌పై ఉన్నవాళ్లందరూ నవ్వేశారు.
4/5శ్రీముఖి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ కావ్యశ్రీ, “నా భర్త నాకన్నా ఎత్తుగా ఉండాలి, డ్రెస్ సెన్స్ బాగుండాలి” అని చెప్పింది. అలాగే, “నాకు ప్రతిరోజూ వంట చేసి పెట్టాలి. అతడు వంట చేస్తే నాకు చాలా ఇష్టం” అని నవ్వుతూ చెప్పింది.
5/5చివరగా కావ్యశ్రీ “ఒకరిని మినహాయించి ఎవరైనా ఓకే” అని చెప్పడం ఆడియన్స్‌లో ఆసక్తి పెంచింది. వెంటనే అందరూ “ఆ ఒక్కరు అంటే నిఖిల్ మలియాక్కల్ గురించేనా?” అంటూ కేకలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానులు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.