Heroine Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ అలరించింది. అయితే కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తన భర్త ఆంటోనీ తట్టిల్, ఫ్యామిలీతో కలిసి మొదటిసారి ఓనం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
1/9హీరోయిన్ కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి.. ఘనంగా ఓనం పండుగను జరుపుకుంది. ఈ సందర్భంగా కీర్తి సోషల్ మీడియాలో కొన్ని అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేసింది.
2/9ఈ ఫొటోల్లో కీర్తి సురేష్.. సాంప్రదాయ తెల్లని చీరలో, బంగారు రంగు అంచుతో, పింక్, గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్‌తో అద్భుతంగా కనిపించింది. ఆమె భర్త కూడా ఎత్నిక్ వేర్‌లో అందంగా కనిపించాడు.
3/9ఈ జంట కూలింగ్ గ్లాసెస్‌తో స్టైలిష్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. మరో ఆకర్షణగా కీర్తి తన పెట్ డాగ్స్‌కి కూడా ట్రెడిషినల్ బట్టలు వేసి, వాటిని వేడుకల్లో భాగం చేసింది కీర్తి సురేష్. ఈ పెట్స్ పండుగకు మరింత ఆకర్షణగా నిలిచాయి.
4/9మ్యారేజ్ తర్వాత తమ ఇంట్లో జరిగిన తొలి ఓనం పండుగ కావడంతో.. కీర్తి సురేష్ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.
5/9కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఫొటోల్లో కీర్తి లుక్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
6/9కీర్తి సురేష్ 2024 డిసెంబర్ 12న గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వివాహం చేసుకుంది. 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఈ జంట గత ఏడాది ఒక్కటయ్యారు.
7/9ప్రముఖ మలయాళ నిర్మాత జి.సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె అయిన కీర్తి.. 2000 సంవత్సరంలో బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
8/92013లో 'గీతాంజలి' సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
9/9ఇటీవల వరుణ్ ధావన్ హీరోగా బాలీవుడ్ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటించగా.. ఆ మూవీ మాత్రం విజయం సాధించలేదు.