Prabhas: ప్రభాస్ హైట్‌తో ఆ విషయంలో చాలా ఇబ్బందిపడ్డా.!. బాంబు పేల్చిన బాలీవుడ్ బ్యూటీ ..

Kriti sanon interesting comment on prabhas: బాలీవుడ్ భామ కృతి సనన్ ఇటీవల మహేష్ బాబు, ప్రభాస్ పై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మొత్తంగా ప్రభాస్ అభిమానులు పొంగిపోతుంటే, మహేష్ బాబు ఫ్యాన్స్ సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. 

1 /7

ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. గత కొన్నిరోజులుగా ప్రభాస్ ,అనుష్క తో పెళ్లి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అనేక ఏఐ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మొత్తంగా కొంత మంది నెటిజన్ లు ప్రభాస్ కు పెళ్లి అయ్యే వరకు కూడా వీరిని అస్సలు వదిలేలా లేరని టాక్ నడుస్తుంది.  

2 /7

ఇక ప్రభాస్ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ నెల 12న ‘బాహుబలి: ది ఎపిక్’ జపాన్ లో విడుదల కానుంది. సినిమా ప్రచారం కోసం జపాన్ వెళ్లిన ప్రభాస్.. అక్కడి అభిమానులతో కలిసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

3 /7

మరోవైపు మహేష్ బాబు రాజమోళీ దర్శకత్వంలో వారాణాసిలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. బాలీవుడ్ భామ కృతి సనన్  మహేష్ బాబు, ప్రభాస్ లపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.  

4 /7

భాలీవుడ్ హీరోయిన్ కృతి ఇటీవల విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఇంటర్య్వూలో కృతి సనన్ ఈవిధంగా మాట్లాడింది. మీతో చాలా మంది నటించిన హీరోలు హైట్ లో తక్కువే కదా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.  అయితే.. కృతి సనన్ మాట్లాడుతూ.. తన కన్న మంచి హైట్ ఉన్న హీరోలతో కూడా నటించానని చెప్పింది. ప్రభాస్, అర్జున్ కపూర్ ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

5 /7

అయితే... ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీ తీసేక్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పింది. అయిన కూడా ఇద్దరం అడ్జస్టు అయి నటించామని కృతి సనన్ నవ్వుతూ చెప్పారు. మరోవైపు  చిన్నతనం నుంచి బాలీవుడ్ మూవీస్ చూస్తుపెరిగానని చెప్పింది.  

6 /7

అసలు మహేష్ బాబు ఇంత పెద్ద హీరో ఎలా అయ్యాడో కూడా తెలిదని బాంబు పేల్చింది. అయితే.. కృతి సనన్ ఈ మాటలు ఇప్పుడు రచ్చగా మారాయి. దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అసలు మహేష్ బాబుతో చేసిన తొలిమూవీ 1 నేనొక్కడినే అదైన గుర్తుందా లేదా మర్చిపోయావా అంటూ అభిమానులు సీరియస్ అవుతున్నారు.  

7 /7

ప్రభాస్, అర్జున్ పేర్లు చెప్పి మహేష్ బాబు పేరు మర్చిపోవడం ఏంటని కూడా అభిమానులు కృతి సనన్ ను బీభత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు.  మొత్తంగా కృతి సనన్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.