Actress Madhavi: 300 సినిమాల్లో నటించిన ఆ టాప్‌ హీరోయిన్‌ కూతురుని చూశారా? అందంలో స్టార్‌ హీరోయిన్లు కూడా దిగదుడుపే..!

Actress Madhavi Daughter Latest Photos: అలనాటి స్టార్ హీరోయిన్ మాధవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాప్ హీరోల సరసన నటించిన ఈ అందాల హీరోయిన్ సౌత్ ఇండియాలో ఒక ఊపు ఊపింది. స్టార్ హీరో చిరంజీవితో పాటు కమల్‌, రజినీలతోపాటు కూడా నటించారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా ఆమె నటించి తనదైన ముద్రను వేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమా రంగాన్నే ఏలిన హీరోయిన్ అని చెప్పొచ్చు.
 

1 /8

 అలనాటి నటి మాధవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆమె అమెరికాలో తన భర్త పిల్లలతో కలిసి ఉంటున్నారు. మాధవి చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ఆసక్తి ఉన్న మంచి నటి అని చెప్పవచ్చు. ఇక సినీ రంగంలోకి 13 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేశారు.   

2 /8

 ఆ తర్వాత ఆమె రాల్ప్‌ శర్మ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అమెరికాలోని న్యూ జెర్సీలోనే భర్త పిల్లలతో ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె పెద్ద కూతురు టిఫనీ, రెండో కూతురు ప్రిసిల్లా ఇక మూడో కూతురు ఎవలీన్‌ ఉన్నారు  

3 /8

అందం విషయంలో మాధవి కూతుళ్లు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు మించిన వారే. వారి ఫోటోలు ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. స్టార్ హీరోయిన్లకు మించిన అందం. ఈ ముగ్గురు కూతుళ్ళది. మాధవి భర్తకు మెడికల్ కంపెనీ, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కోట్లలో బిజినెస్‌  

4 /8

 కోట్ల విలువ చేస్తే ఆస్తులు కలిగి ఉన్నారు . 1996 లోనే మాధవి వివాహం చేసుకున్నారు. ఒక్కో కూతురు బాలీవుడ్ హీరోయిన్లు మించిన అందంతో ఎప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. రెండో కూతురు ప్రముఖ కంపెనీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.  

5 /8

ముగ్గురు కూతుళ్లు విదేశాల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇటీవలె తన పెద్ద కూతురు ఎక్కువ మార్కులతో గ్రాడ్యుయేషన్ పాసైన సంగతి కూడా తెలిసింది. ఆ విషయాన్ని కూడా మాధవి షేర్ చేసుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయంలో ఆమెకి ఆఫర్స్‌ వచ్చాయని సమాచారం.   

6 /8

ఈ నేపథ్యంలో మాధవికి పెద్ద ఎత్తున అభినందనలు కూడా వెల్లువెత్తాయి. తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు మాధవి. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె వివాహం చేసుకున్నారు. చిరంజీవితో పాటు రజనీకాంత్ ,కమల్ హాసన్ తో కూడా నటించారు.   

7 /8

 మొదటగా తెలుగు సినిమాలో అరంగేట్రం చేసిన మాధవి.. ఆ తర్వాత హిందీ, మలయాళం, తమిళ చిత్రాల్లో కూడా నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. భరతనాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం కలిగి ఉంది. తన రెండో కూతురు ప్రిసిల్లా అయితే అచ్చం మాధవిలాగానే ఉంటారు.  

8 /8

 మాధవికి మించిన అందగత్తె అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ బ్యూటీస్ ఎవరూ కూడా ఈ అమ్మాయి ముందు దిగదుడుపే. ఇక పెద్ద కూతురు, చిన్న కూతురు కూడా అందంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు మించిన వారే.