Meena Shocking comments on Mithun Chakraborty: ఆ హీరో హోటల్ కు వచ్చి పదే పదే బతిమాలే వాడని నటి మీనా చెప్పుకొచ్చింది. ఒకనోక సందర్బంలో హోటల్ కు వెళ్లాలన్న కూడా భయంవేసేదని మీనా అసలు విషయంను బైటపెట్టింది.
సీనియర్ హీరోయిన్ నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో అభిమానుల్ని ఫిదా చేసింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా.. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
మరోవైపు సినిమాలంటూ డబ్బులు సంపాదించిన కూడా తన అందమైన తన బాల్యాన్ని, ఎన్నో ఆనందాలను కోల్పోయానని నటి పలు మార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తినడానికి, నిద్రపోవడానికి కూడా టైం ఉండేది కాదని మీనా చాలా సార్లు ఎమోషనల్ అయ్యారు.
ఆతర్వాత.. బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మీనా పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే కుమార్తె ఉంది.ఆతర్వాత.. అంతా బాగుందని అనుకునే క్రమంలో.. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో 2022 జూన్ 28న కన్నుమూశారు. ఆ సమయంలో చాలా డీప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కనీసం భర్త చనిపోయి పట్టున పదిరోజులు కూడా కాకముందే తన రెండో పెళ్లి గురించి పుకార్లు రావడంతో మరింత కుంగిపోయినట్లు చెప్పుకొచ్చింది.
పలు మార్లు దీనిపై సీరియస్ గా స్పందించింది. అయిన కూడా పుకార్లు మాత్రం ఆగక పోవడంతో ఆతర్వాత మీనా ఈ విషయాల్ని పట్టించుకొవడం మానేసింది. ఆ తర్వాత తరచుగా పెళ్లి అంటూ కొన్నిసార్లు, ప్రెగ్నెన్సీ అంటూ కూడా రూమర్స్ నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా... నటి మీనా బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి పలు మార్లు మూవీస్ విషయంలో నో చెప్పాల్సి వచ్చిందనే విషయంను రివీల్ చేశారు.
బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ ఉండేదన్నారు. అప్పట్లో షూటింగ్స్ అన్నీ అక్కడే జరిగేవి. అందుకే స్టార్స్ అందరూ అక్కడే బస చేసేవారు. ఎప్పుడు అక్కడకు వెళ్లిన ప్రతిసారి మిథున్ చక్రవర్తి తన దగ్గరకు వచ్చి.. తనతో మూవీ ఎప్పుడు తీస్తారని, డేట్ ఎప్పుడు ఇస్తారని అడిగేవారని చెప్పుకొచ్చింది.
కానీ తన బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ కుదిరేది కాదని, ఒకనోక సందర్భంలో ఆ హోటల్ కు వెళ్లాలంటేనే భయంవేసేదని నటి అసలు విషయంను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బైటపెట్టింది. కొన్నిసార్లు ఆ హోటల్ లో రూమ్ బుక్ చేయోద్దని కూడా చెప్పేదాన్నంటూ కూడా మీనా అసలు నిజం బైటపెట్టింది.