Add Zee Business As A Preferred Source
App

Meenakshi Chaudhary: డేటింగ్ రూమర్స్‌వేళ మరోసారి అడ్డంగా దొరికిపోయిన మీనాక్షి చౌదరి – సుశాంత్.!. అసలు మ్యాటర్ ఏంటంటే.?.

Written ByInamdar Paresh
Published: Sep 05, 2025, 04:59 PM IST|Updated: Sep 05, 2025, 05:03 PM IST

Meenakshi Chaudhary and Akkineni Sushant Dating: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి – సుశాంత్ డేటింగ్ రూమర్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ కలిసి క్లోజ్ గా ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
 

Meenakshi Chaudhary:1/6

టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి:

సాధాణంగా సెలబ్రీటీలు  ఒకరితో మరోకరు ఏమన్న కాస్త క్లోజ్ గా కన్పించిన కూడా వెంటనే వారి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ పుకార్లు క్రియేట్ చేస్తారు. అంతే కాకుండా.. డేటింగ్, పెళ్లికి రెడీ అయిపోయారంటూ వార్తల్ని వైరల్ చేస్తారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్  మీనాక్షి చౌదరి , సుశాంత్ లు ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.   

sushanth:2/6

సుశాంత్:

దీన్ని బలం చేకూర్చేలా ఇద్దరు చాలా క్లోజ్ గా కన్పిస్తున్నారు. గతంలో కూడా వీరిమధ్య ఎఫైర్‌ వార్తలు వినిపించినప్పటికీ, మీనాక్షి తనను సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే తాజా వీడియో బయటకు రావడంతో మళ్లీ గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి.   

Meenakshi chaudhary dating:3/6

టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి డేటింగ్ రూమర్స్ :

తాజాగా.. వీరిద్దరు కూడా ఎయిర్‌పోర్టులో చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నడుస్తోన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిలో మీనాక్షి చౌదరి తన ముఖానికి మాస్క్ వేసుకొని  కనిపించగా.. సుశాంత్ లగేజ్ ట్రాలీతో పాటు మరో బ్యాగ్ చేత్తో పట్టుకుని ముందుకు వెళ్తున్నారు. వీళ్లను చూసిన అభిమానులు మాత్రం ఫోటోల కోసం పొటీపడ్డారు.   

sushanth dating with meenakshi rumours:4/6

టాలీవుడ్:

కెమెరా వాళ్లు, మీడియా వాళ్లు వీళ్ల ఫోటోల్ని తీయడానికి,మాట్లాడేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి గురించి మళ్లీ పుకార్లు షికారు చేస్తున్నాయి.

tollywood:5/6

మీనాక్షి చౌదరీ లేటెస్ట్ న్యూస్ :

మరోవైపు.. గుంటూరు కారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో  మీనాక్షి చౌదరీ బిజీగా ఉన్నారు.  ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌  ఈ భామ ఎంట్రీ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ భామకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. దీనితో పాటు చిరంజీవి విశ్వంభరలో కూడా ఈ భామకు చాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా దీనిలో ఈ నటి దేవకన్యల కన్పించనున్నారని కూడా టాక్ నడుస్తొంది.  

Meenakshi chaudhary latest news:6/6

ఎయిర్ పోర్టులో దొరికిపోయిన మీనాక్షి చౌదరీ, సుశాంత్:

దీనితో పాటు గుంటూరు కారం, లక్కీ భాస్కర్ సినిమాలు ఈ భామకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టిన సినిమాలుగా  చెప్పుకొవచ్చు. మరోవైపు.. నవీన్ పోలిశెట్టితో 'అనగనగా ఒక రాజు’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఎయిర్‌పోర్టులో సుశాంత్‌తో కనిపించి మరోసారి రూమర్స్ కు మరింత బలంను చేకూర్చారు.