Add Zee Business As A Preferred Source
App

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. ఆ యాక్షన్ స్టార్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్

Written ByAruna Maharaju
Published: Sep 27, 2025, 09:29 PM IST|Updated: Sep 27, 2025, 09:29 PM IST

Actress Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది. “ఇచట వాహనములు నిలుపరాదు”  అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్స్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. అయితే తాజాగా మీనాక్షి చౌదరి తీసుకున్న ఓ నిర్ణయంపై.. ఆమె ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


 

Actress Meenakshi Chaudhary1/5

హీరోయిన్ మీనాక్షి చౌదరి

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి కూడా ఉంది. మోడలింగ్ నుండి మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. 

Meenakshi Chaudhary2/5

మీనాక్షి చౌదరి

ప్రస్తుతం మీనాక్షి చౌదరి.. నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సినిమా యూనిట్. 

Actress Meenakshi Chaudhary Bollywood Entry3/5

హీరోయిన్ మీనాక్షి చౌదరి

అయితే మీనాక్షి చౌదరి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో రాబోతున్న ‘ఫోర్స్ 3’ సినిమాలో మీనాక్షి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మీనాక్షి లుక్ టెస్ట్ కూడా అయిపోయిందట.    

Heroine Meenakshi Chaudhary4/5

హీరోయిన్ మీనాక్షి చౌదరి

భావ్ ధూలియా డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం కోసం మీనాక్షికి కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వనున్నారట.  

Meenakshi Chaudhary5/5

మీనాక్షి చౌదరికి బాలీవుడ్ బంపర్ ఆఫర్

ఇక మీనాక్షి చౌదరి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా మంది టాలీవుడ్ హీరోయిన్స్.. బాలీవుడ్‌లో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు. కానీ తొలి సినిమానే మంచి స్థాయిలో ఉండకపోతే, బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం కష్టం. మరి బాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి విజయం సాధిస్తుందా లేక తెలుగులోనే దృష్టి సారిస్తుందా అనేది చూడాలి.