Star Heroine pregnant
సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కారణం ఏంటంటే… పెళ్లి కాకుండానే ఒక తెలుగు స్టార్ హీరోయిన్ గర్భవతిలా కనిపించడం. బేబీ బంప్‌తో నడుస్తూ కనిపించిన ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వెళితే..
1/5తెలుగు స్టార్ హీరోయిన్ ఒకరు పెళ్లి చేసుకోకుండానే గర్భవతిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న. మృణాల్ ఠాకూర్ బాగా పరిచయం. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న.. కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె తెలుగులోనే కాకుండా హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
2/5త్వరలో విడుదలకానున్న డకాయిత్ సినిమాలో మృణాల్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో హాట్ టాపిక్ అయింది. ఆ వీడియోలో మృణాల్ బేబీ బంప్‌తో, ప్రెగ్నెంట్ మహిళలా నడుస్తూ కనిపించింది. ఆమె నడవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం గమనించవచ్చు.
3/5అంతేకాదు, ఆ వీడియోలో బాలీవుడ్ హీరో వరుణ్ దావత్ కూడా ఆమెతో పాటు కనిపించారు. మృణాల్‌ను చెయ్యి పట్టి నడిపిస్తూ తీసుకువస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో నెటిజన్లలో మరింత గందరగోళం మొదలైంది.
https://www.instagram.com/reel/DUXt-EPCBfK/?igsh=NXY0em16eGlqam9p
4/5కానీ చివరికి అసలు విషయం బయటికి వచ్చింది. ఇది నిజ జీవితానికి సంబంధించినది కాదు. ఇది పూర్తిగా ఒక సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో అని తెలిసింది. పాత్ర కోసం మృణాల్ బేబీ బంప్ వేసుకుని నటించిందని సమాచారం. షూటింగ్ సమయంలో మీడియా వాళ్లు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
5/5అంతేకాదు, ఇటీవల మృణాల్ గురించి కొన్ని పెళ్లి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ సమయంలోనే ఈ వీడియో రావడంతో మరింత కన్ఫ్యూజన్ ఏర్పడింది.