tvk Vijay rally stampede: టీవీకే పార్టీ కరూర్ ఘటనపై తమిళ నటి ఓవియా రియాక్ట్ అయ్యింది. దీనిపై విజయ్ ను అరెస్ట్ చేయాలని ట్విట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వార్ మొదలైంది. నటిని బూతులు తిడుతూ విజయ్ అభిమానులు రెచ్చిపోయారు.
1/6తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ మీటింగ్ తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 39 మంది దుర్మరణం చెందగా, మరో 100 మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
2/6మరోవైపు దీనిపై స్టాలీన్ ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. రిటైర్డు హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో విజయ్ దీనిపై స్పందించారు. తన గుండె ముక్కలైందని విచారం వ్యక్తం చేశారు.
3/6బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఎక్స్ గ్రెషియా కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో 39 మంది అమాయకుల ప్రాణాలు బలవ్వడానికి కారణమైన విజయ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ లు వస్తున్నాయి.
4/6ఈ నేపథ్యంలో తమిళ నటి ఓవియా దీనిపై రియాక్ట్ అయ్యారు. కరూర్ టివీకే పార్టీ లో తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గాయపడ్డవారు తొందరగా కొలుకొవాలని ఆశిస్తున్నట్లు ట్విట్ రాసుకొచ్చింది. నటి ఓవియా తమిళ బిగ్ బాస్ లో హల్ చల్ చేసింది. గతంలో ప్రధాని మోదీపై కాంట్రవర్సీగా ట్విట్ చేసి వార్తలలో నిలిచింది.
5/6ఇంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత .. విజయ్ దళపతికి అరెస్ట్ చేయాలని కూడా రాసుకొచ్చింది. ఇక దీనితో రచ్చ మొదలైంది. ఆమె ట్విట్ చేసిన కొద్ది నిముషాలకే విజయ్ అభిమానులు ఆమెను ఘెరంగా బూతులు తిడుతూ రీట్విట్ లు చేశారు. ఆమెను పూర్తిగా ట్రోల్స్ చేశారు. వెంటనే ట్విట్ డిలీట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
6/6ఇంకా వీరితో తనకు గొడవ ఎందుకని.. ఓవియా ఆ ట్విట్ ను డిలీట్ చేసి.. మరో కొటెషన్ పోస్ట్ చేసింది. హీరోయిన్ ఓవియా జీవితం మేధావులకు కలలాంటిది, మూర్ఖులకు ఆట.. ధనవంతులకు కామెడీ, అదే పేదలకు విషాదం అని అర్థం ఉన్న పోస్ట్ పెట్టింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. కొంత మంది ఓవియాకు సపోర్ట్ చేప్తుండగా మరికొంత మంది మాత్రం ఆమెను బూతులతో ఏకీపారేస్తున్నారు.