Actress Parineeti Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రియాంక చోప్రా చెల్లెలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ మధ్య సినిమాలని తగ్గించిన పరిణితి చోప్రా.. 2023లో పొలిటికల్ లీడర్ అయిన రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో తాను అమ్మ కాబోతున్నానంటూ గుడ్‌న్యూస్ చెప్పిన పరిణితి.. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
1/5పరిణితి చోప్రాకి బాబు పుట్టాడు. ఈ గుడ్‌న్యూస్‌ని ఆమె భర్త రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారన్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో చేరిన పరిణితి.. మధ్యాహ్నం పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది.
2/5దీంతో బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, పరిణితి చోప్రా అభిమానులు, నెటిజన్లు.. ఈ దంపతులకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
3/52023 సెప్టెంబర్ 24న ఉదయపూర్‌లో పెద్దల సమక్షంలో.. అంగరంగ వైభవంగా పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్‌గా జరిగింది.
4/5పరిణితి చోప్రా నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు.. ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.
5/5ఇక గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించిన పరిణితి.. ప్రస్తుతం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో నటించింది.