Bala krishan Vs Chiranjeevi: బాలయ్య, చిరుల మధ్య వివాదం ఇటీవల పీక్స్ కు చేరింది. ఏకంగా చిరంజీవి అభిమానులు రెండు తెలుగు స్టేట్స్ లలో 300 పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి బాలయ్యను ప్రశంసిస్తు పోస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది..
1/6ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పటికే రచ్చగానే ఉంది. దీనిపై చిరంజీవి తన బహిరంగ లేఖతో స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చిన కూడా వివాదం సద్దు మణగడంలేదు. చిరును పట్టుకుని.. ఏపీ అసెంబ్లీలో వేటకారంగా మాట్లాడతారా అంటూ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ముఖ్యంగా చిరు అభిమానులు దీనిపై ఇటీవల బ్లడ్ బ్యాంక్ దగ్గర హోటల్ లో సమావేశం అయ్యారు.
2/6బాలయ్యపై తెలుగు స్టేట్స్ లలోని 300 ల పీఎస్ లలో ఫిర్యాదులు చేసేందుకు రెడీఅయ్యారు.ఈ విషయం చిరంజీవికి తెలియడంతో ఆయన సున్నితంగా వారించారు. ఇలాంటి పనులు చేయోద్దని సూచించారు. ఈ క్రమంలో బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
3/6చిరంజీవి–బాలకృష్ణ వివాదం ముదిరి పాకాన పడిన ఈ నేపథ్యంలో బాలకృష్ణను పొగుడుతూ హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. గతంలో బాలయ్య హిట్ సినిమాల్లో ఆయన నటన గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించింది. నందమూరీ బాలయ్య చిన్న పిల్లాడిలా ఎంతో ఎనర్జీతో ఉంటారని చెప్పుకొచ్చింది. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది టైంను బట్టి బయటపడుతుందని ట్విట్ చేసింది. గతంలో బాలకృష్ణ గురించి వేసిన ఓ పోస్ట్‌ను మరోసారి రీ పోస్ట్ చేసింది.
4/6గతంలో ఓ వేడుకలో ‘సమర సింహారెడ్డి’ చిత్రంలోని “నందమూరి నాయకా అందమైన కానుకా .. అనే పాటకి తాను డ్యాన్స్ వేస్తుంటే.. బాలకృష్ణ కేరింతలు కొడుతూ చూసే వీడియోను 2024, సెప్టెంబర్ 1న ట్వీట్ చేసింది. ఆ సమయంలో ఆమె బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించింది.
5/6బాలయ్య మహా వృక్షం లాంటి వారని,అన్ని వేళలా మనుషులు, జంతువులకు నీడనిస్తుంటుందన్నారు. ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఎనర్జీతో కనిపించారని రాసుకొచ్చింది. అది ఆయనకు భగవంతుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం అంటూ ట్విట్ చేసింది.ఈ ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. చిరుతో వివాదం వేళ హీరోయిన్ బాలయ్యను పొగుడుతూ చేసిన ట్విట్ ను బాలయ్య అభిమానులు ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. అది మా బాలయ్య రేంజ్ అంటూ కూడా మరోసారి చిరు ఫ్యాన్స్ కు సెటైర్ లు వేస్తున్నారు.
6/6మరోవైపు పూనమ్ కౌర్.. ‘మాయాజాలం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ లో చేరింది. తరచుగా ఏదైన కాంట్రవర్సీలపై తనదైనశైలీలో పూనమ్ కౌర్ లు ట్విట్ లు చేస్తుంటుంది. ఈ క్రమంలో.. తాజాగా అగ్ర హీరో నందమూరి బాలకృష్ణపై పూనమ్ చేసిన చేసిన ట్వీట్ వార్తలలొ నిలిచింది.