Add Zee Business As A Preferred Source
App

Samantha Marriage: ఒకరి ఇంటిని పాడుచేసి కొత్తిల్లు కట్టుకున్నావ్.!. సమంతపై స్టార్ హీరోయిన్ సంచలన ట్విట్..

Written ByInamdar Paresh
Published: Dec 01, 2025, 06:07 PM IST|Updated: Dec 01, 2025, 06:12 PM IST

Poonam Kaur on Samantha raj nidimoru marriage: స్వయం శక్తి, చదువుకున్నాననే అహంకారంతో ఒకరి ఇల్లును పాడు చేసి కొత్తిల్లు కట్టుకున్నావ్ అంటూ సమంతపై స్టార్ హీరోయిన్ ఫైర్ అయ్యింది.ఈ క్రమంలో పూనమ్ కౌర్ చేసిన ట్విట్ నెట్టింట రచ్చగా మారింది.
 

Poonam kaur fires on samantha:1/6

సమంత పెళ్లి వార్తలు:

సమంతా, రాజ్ నిడిమోరు లు ఫైనల్గా పెళ్లి  బంధంతో  ఒక్కటయ్యారు. వీరి వివాహం ఈషా ఫౌండేషన్ లో సింపుల్గా జరిగింది. కొద్ది మంది అతిథులు, బంధువుల మధ్య వీరి పెళ్లి జరిగింది. అయితే.. ప్రస్తుతం సామ్.. తన ఇన్ స్టాలో  రాజ్ నిడిమోరుతో తమ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు.   

samantha wedding:2/6

సమంత వివాహం:

ఈ క్రమంలో కొత్త జంటకు సమంత అభిమానులు, ఫ్రెండ్స్ ప్రత్యేకంగా విషేస్ చెబుతున్నారు.  ఇదిలా ఉండగా హీరోయిన్ పూనమ్ కౌర్ సమంతా, రాజ్ నిడిమోరు పెళ్లిపై చేసిన ట్విట్ సంచలనంగా మారింది. ఒకరి ఇంటిని పాడు చేసి నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావ్ అంటూ సమంతాపై మండిపడింది.  

Samantha ruth prabhu:3/6

సమంత రాజ్ నిడిమోరు పెళ్లి:

అంతేకాకుండా.. స్వయం శక్తి, చదువుకున్నననే పొగరుతో ఉన్న మహిళ. బలహీనమైన, నిస్సాహయమైన పురుషులను డబ్బులతో కొనగలదంటూ కూడా పూనమ్ కౌర్ ట్విట్ చేశారు. అయితే.. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ఈ ట్విట్ నెట్టింట సంచలనంగా మారింది. పూనమ్ కౌర్ సమంత పెళ్లిని ఉద్దేశించి ఈ ట్విట్ చేసిందని కూడా నెట్టింట రచ్చ మొదలైంది . మొత్తంగా ప్రస్తుతం సమంతపై  కొంత మంది నెటిజన్లు కూడా సెటైర్ లు కూడా వేస్తున్నారు.   

poonam kaur:4/6

పూనమ్ కౌర్:

మరోవైపు రాజ్ నిడిమోరు మాజీ భార్య సైతం.. తెగించిన వాళ్లే ఇలా చేస్తారంటూ రాజ్ నిడిమోరు, సమంత పెళ్లి వార్తలపై తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ చేసిన ట్విట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ఇటీవల మూవీస్ కన్నా.. ఎక్కువగా కాంట్రవర్సీ అంశాలతోనే ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే.  

samantha raj nidimoru:5/6

సమంత రాజ్ నిడిమోరు:

అయితే.. గత కొంతకాలంగా ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు సమంత, రాజ్ నిడిమోరు అధికారికంగా ఫుల్ స్టాప్ చెప్పారు.  వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా, తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహ వేడుక జరిగింది. 

samantha:6/6

సమంత:

2024 నుంచి వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కానీ ఎక్కడకు వెళ్లిన జంటగా కన్పిస్తు ఈ లవ్ బర్డ్స్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా హింట్ లు ఇచ్చారు.  ప్రస్తుతం కొత్త జంటకు మాత్రం నెట్టింట భారీగా అభిమానులు విషేస్ లు చెబుతున్నారు.