Add Zee Business As A Preferred Source
App

Priyanka Mohan: వెకేషన్ మోడ్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్.. బీచ్‌లో చిల్ అవుతూ ఫొటోలకు ఫోజులు

Written ByAruna Maharaju
Published: Sep 07, 2025, 06:51 PM IST|Updated: Sep 07, 2025, 06:51 PM IST

Priyanka Mohan Vacation: ప్రియాంక మోహన్.. ఈ హీరోయిన్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. రెగ్యులర్‌గా తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ వెకేషన్‌కి వెళ్లిన ఫొటోలను షేర్ చేయగా.. ఇప్పుడు అవి నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారాయి. 

Heroine Priyanka Mohan1/10

హీరోయిన్ ప్రియాంక మోహన్

స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది హీరోయిన్ ప్రియాంక మోహన్. పేరుకు మలయాళ నటినే అయినా పక్కింటమ్మాయిలా కనిపిస్తూ.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. కెరీర్ ప్రారంభంలోనే నాని, శర్వానంద్ లాంటి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 

Priyanka Mohan2/10

ప్రియాంక మోహన్

2019లో ఓంద్ కథే హెల్లా అనే కన్నడ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది ప్రియాంక. ఇక అదే సంవత్సరం న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2022లో హీరో శర్వానంద్‌తో కలిసి శ్రీకారం సినిమా చేసింది. 

Priyanka Mohan3/10

హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫొటోలు

ప్రియాంక మోహన్ 20 నవంబర్ 1994న జన్మించింది. ఆమె తండ్రి తమిళనాడుకి చెందిన వాడు కాగా.. తల్లిది కర్ణాటక. ఇక ప్రియాంక మూడబిద్రిలోని అల్వాస్ PU కళాశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చదివింది.    

Heroine Priyanka Mohan4/10

హీరోయిన్ ప్రియాంక మోహన్ సినిమాలు

2021లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన శివకార్తికేయన్ యొక్క డాక్టర్‌ సినిమాతో.. ప్రియాంక మోహన్ తమిళంలో అడుగు పెట్టింది. ఆమె నటనకు మంచి స్పందన లభించింది.   

Heroine Priyanka Mohan5/10

హీరోయిన్ ప్రియాంక మోహన్ మూవీస్

ఈ డాక్టర్ సినిమా  ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌లో రూ. 100 కోట్లు వసూలు చేసింది. అంతేకాకుండా ఈ చిత్రానికి ప్రియాంక ఉత్తమ నూతన నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది.  

Priyanka Mohan6/10

ఓజీ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్

2024లో ధనుష్‌కి జోడిగా కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం తమిళంలో విడుదలైంది.   

Heroine Priyanka Mohan movies7/10

హీరోయిన్ ప్రియాంక మోహన్

ఇక ఈ అందాల తార ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఓజీ సినిమాలో ప్రియాంకనే మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైంది. చివరిగా సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది ప్రియాంక మోహన్.   

Heroine Priyanka Mohan8/10

ప్రియాంక మోహన్

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.   

Priyanka Mohan Vacation Pics9/10

హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ మూవీస్

తాజాగా వెకేషన్‌లో దిగిన ఫొటోలను షేర్ చేసింది ప్రియాంక మోహన్. బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక ఫొటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.    

Priyanka Mohan Vacation Pics10/10

హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫొటోలు

ఇక ఈ ఫోటోలపై నెటిజన్స్, ఫ్యాన్స్ లుకింగ్ ప్రెట్టీ, గార్జియస్, బ్యూటిఫుల్ అంటూ క్రేజీ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.