Add Zee Business As A Preferred Source
App

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ను కాళ్లతో కొట్టిన అబ్బాయి.. అసలేమైందంటే..?

Written ByVishnupriya
Published: Oct 20, 2025, 01:18 PM IST|Updated: Oct 20, 2025, 01:18 PM IST

Rakul Preet: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఒక అబ్బాయి కాళ్లతో తన్నినట్టు..  అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకీ ఏం జరిగింది అని పూర్తి వివరాల్లోకి వెళితే..

Rakul Preet Shocking1/5

రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి సినిమాలలో కనిపించలేదు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించి,  తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. 

Rakul Preet Singh 2/5

రకుల్ ప్రీత్ సింగ్

తాజాగా రకుల్ ప్రీతిసింగ్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రకుల్ ను ఒక అబ్బాయి కాలితో తన్నినట్లు  అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీతిసింగ్ తన భర్తతో కలసి ఏదో హోటల్ నుంచి బయటికి వస్తున్న సందర్భంలో తన భార్య రకుల్ వెనుక వైపు ఉన్న విషయాన్ని గమనించలేదు. 

Rakul Viral Video 3/5

రకుల్ ప్రీత్ సింగ్

దీంతో అబ్బాయిని ఎత్తుకుంటున్న సమయంలో రకుల్ ప్రీతిసింగ్ ఫేస్ కి ఆ అబ్బాయి కాళ్లు తగిలినట్లుగా కనిపిస్తోంది. ఆ తర్వాత రకుల్ ప్రీతిసింగ్ ఈ విషయాన్ని చెప్పినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయం చూసిన అభిమానులు అయ్యో రకుల్ చూసుకోవాలి కదా కామెంట్స్ చేస్తున్నారు. 

 

          View this post on Instagram                      

A post shared by Instant Bollywood Videos (@instantbollywoodvideos)

Rakul Preet Singh Shocking Incident 4/5

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీతిసింగ్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. మొదటిసారిగా గిల్లి అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో కెరటం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

Rakul Preet Singh Movies5/5

రకుల్ ప్రీత్ సింగ్

ఆ తర్వాత లౌక్యం, పండగ చేసుకో, నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక, తదితర చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తెలుగులో మళ్ళీ ఏ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ప్రస్తుతమైతే ఇండియన్ 3 సినిమా తన చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.