Bold Actress: ఆ ఇమేజ్ తో తనకు బోల్డ్ తరహా పాత్రలే వస్తున్నాయి.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు..

Bold Actress: తెలుగులో కొంత మంది నటీమణులు కొన్ని పాత్రలు చేయడంతో వాళ్లపై ఓ ముద్ర వేసేస్తారు. మంచి నటీమణులైన వాళ్లకు ఆ తర్వాత అలాంటి తరహా పాత్రలే వాళ్లను పలకరిస్తూ ఉంటాయి. అలాంటి భామల్లో రమ్యశ్రీ ఒకరు.

1 /6

Bold Actress:రమ్యశ్రీ తన కెరీర్ లో ఎక్కువగా బోల్డ్ తరహా పాత్రలే పోషించింది... అనేకంటే అలాంటి పాత్రలే తనకు వచ్చాయంటోంది రమ్యశ్రీ. కెరీర్ మొదట్లో  కొన్ని సినిమాల్లో కొన్ని బోల్డ్ కంటెంట్ పాత్రలు చేయడంతో .. ఎవరైనా సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో ఆ పాత్రలు ఉంటే తనను సంప్రదించే వారట. తాను కోరుకున్న పాత్రల కంటే.. తనకు వచ్చిన పాత్రలే ఎంచుకోవడం బెటర్ అన్న కాన్సెప్ట్ తో తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ తరహా చేయాల్సి వచ్చిందన్నారు రమ్యశ్రీ.

2 /6

అంతేకాదు రమ్యశ్రీ తెలుగు, సహా దక్షిణాది సహా 9 భాషల్లో కథానాయికగా నటించారు. తన మాతృభాష తెలుగులో కంటే కన్నడలో కథానాయికగా రాణించింది. ప్రస్తుతం రమ్యశ్రీ సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది.

3 /6

రమ్యశ్రీ విశాఖ పట్నానికి చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ అభివృద్ధిని చూసిన తర్వాత రమ్యశ్రీ చంద్రబాబు నాయుడు అభిమాని గా మారింది. 

4 /6

ఆ తర్వాత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల కారణంగా వైయస్ ఆర్ అభిమానిగా మారినట్టు పలు సందర్భాల్లో చెప్పుకొంటూ వస్తున్నారు.  

5 /6

నటి రమ్యశ్రీ, తన కెరీర్ గురించి, సినీ పరిశ్రమలోని సమస్యల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రమ్మశ్రీ ఇటీవల ఒక ఛానెల్‌తో మాట్లాడుతూ..  తనకు ఇండస్ట్రీలో జరిగిన చేదు అనుభవాల గురించి మాట్లాడారు. తాను హాలీవుడ్ నటిలా కనిపిస్తున్నానని ఎవరో అంటే తాను మురిసిపోయేదానన్నారు.  

6 /6

నా భాష నాకు తల్లి లాంటిది. నేను నా మాతృభాషను, యాసను ఎందుకు వదులుకోవాలన్నారు.  నాకు దాదాపు 80 దేశాలలో అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చింది. అంతే కాదు, కొంతమంది తనపై పోర్న్ సినిమాల్లో నటించమని ఒత్తిడి చేసిన విషయాన్ని ఇంటర్వ్యూల్లో  రమ్యశ్రీ వెల్లడించింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్యశ్రీకి అలాంటి ఆఫర్ ఎవరు ఇచ్చారో ఇప్పటికీ తెలియదు. ఆమె ఈ ఆఫర్ ఎవరు ఇచ్చారో చూడాలి.