Rashmika Mandanna controversy: రష్మిక మందన్నకు సంబంధించి ఈ మధ్య ఒక హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ యామి గౌతమ్ రష్మిక గురించి అన్నమాతలు ఆమె అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. పూర్తి వివరాలు లోకి వెళితే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును ఏర్పరుచుకుంది. కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సెన్సేషన్‌గా మారింది.
అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప 2' ఘనవిజయం సాధించి రష్మికకు 'నేషనల్ క్రష్' అనే బిరుదును తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇటీవల విడుదలైన 'ఛావా' చిత్రంతోనూ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. రష్మిక చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇటీవల రష్మిక మందన్న తన కాలుకు గాయమైన విషయాన్ని ఫోటో ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే, బాలీవుడ్ నటి యామి గౌతమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
యామి మాట్లాడుతూ, "నాకు కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉంది. కానీ నేను రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమి తిన్నానో చెప్పాల్సిన అవసరం లేదు. గాయపడ్డా, కానీ అది చెప్పుకోలేదు. రష్మిక లాంటి స్టార్‌లు అన్నింటిని షేర్ చేయడం ఎంతవరకు అవసరం?" అంటూ వ్యాఖ్యానించింది.
యామి గౌతమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది నెటిజన్లు "రష్మికను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అవసరమా?" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది యామి గౌతమ్ వైఖరిని సమర్థించగా, మరికొందరు రష్మికకు మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు రష్మిక మందన్న దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ, అభిమానులు ఆమెను మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తున్నారు.