Sai Pallavi In Siima Awards 2025: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) ఈ ఏడాది దుబాయ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ అవార్డుల వేడుకలో సాయిపల్లవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
1/8లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో.. ఎప్పటిలానే చీరకట్టుతో అభిమానుల్ని మెస్మరైజ్ చేసింది.
2/8తమిళ చిత్రసీమలో సాయిపల్లవి నటించిన 'అమరన్' మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
3/8అమరన్ సినిమాలో కనబరిచిన అద్భుత నటనకుగానూ సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
4/8ఈ సినిమాలో సాయిపల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
5/8అమరన్ చిత్రానికి గాను రాజ్‌కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, సంగీతం అందించిన జీవీ ప్రకాశ్‌కుమార్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డు గెలుచుకున్నారు.
6/8ఇక ఈ సైమా అవార్డుల వేడుకలో సాయిపల్లవి పీచ్ కలర్ పింక్ సారీలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచింది.
7/8తన సింపుల్ లుక్, నవ్వుతో ప్రేక్షకుల మనసు ఫిదా చేసింది సాయి పల్లవి.
8/8సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రామాయణ్ మూవీలో నటిస్తోంది.