Add Zee Business As A Preferred Source
App

Samantha: మోడ్రన్ డ్రెస్‌లో సింపుల్ లుక్‌లో సమంత.. ఫొటోలు వైరల్..!

Written ByAruna Maharaju
Published: Sep 24, 2025, 05:02 PM IST|Updated: Sep 24, 2025, 05:02 PM IST

Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. కేవలం నటనలోనే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలోనూ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. మ్యారేజ్ లైఫ్ బ్రేకైన తర్వాత.. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ సమంత.. ప్రస్తుతం తన ఫిట్‌నెస్ మీదే దృష్టి పెట్టింది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేయగా అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..

Samantha Photos1/5

హీరోయిన్ సమంత

హీరోయిన్ సమంత.. ఈ పేరు గురించి వినని తెలుగు ఆడియన్స్ ఉండరు. తన అందం, అభినయం, చక్కని నటనతో కోట్లాది అభిమానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించింది సామ్. ప్రస్తుతం నటిగా కాకుండా నిర్మాతగా కూడా తన లక్‌ను పరీక్షించుకుంటోంది.  

Samantha Raj Nidimoru2/5

హీరోయిన్ సమంత బాయ్ ఫ్రెండ్

అప్లట్లో సంవత్సరానికి కనీసం మూడు, నాలుగు సినిమాలు చేసిన సమంత.. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఖుషీ సినిమా తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారిన సమంత.. ట్రలాలాను ఏర్పాటు చేసి, శుభం సినిమాతో నిర్మాతగా తొలి సక్సెస్ అందుకుంది. ఇందులో ఓ చిన్న పాత్ర కూడా చేసింది.   

Samantha Latest Photos3/5

సమంత రాజ్ నిడిమోరు

సినిమాల కంటే వెబ్ సిరీస్‌ల వైపే ఎక్కువగా సమంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం హిందీలో రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్‌‌లో నటిస్తోంది సామ్. దీని తర్వాత మరో సిరీస్ కూడా లైన్‌లో ఉంది. మరోవైపు నిర్మాతగానూ సినిమాలు నిర్మించేందుకు కథలు వింటుంది సమంత. ప్రస్తుతం మా ఇంటి బంగారం నిర్మిస్తూ, నటిస్తుంది.   

Samantha4/5

సమంత

ఈ మధ్య సమంత ప్రొఫెషనల్ లైఫ్ కంటే.. పర్సనల్ లైఫ్‌ మీద ఎన్నో గాసిప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సామ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా వీరిద్దరూ ఒకేసారి జిమ్ నుండి బైటకొస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

Actress Samantha5/5

సమంత లేటెస్ట్ ఫొటోలు

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడూ తన ఫొటోషూట్స్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫొటోలను సమంత షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వావ్ సో క్యూట్, లుకింగ్ ప్రెట్టీ, గార్జియస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.