Add Zee Business As A Preferred Source
App

Samantha: ఒంటిపై పామును వేసుకున్న హీరోయిన్ సమంత.. ఫొటోలు వైరల్‌

Published: Oct 03, 2025, 04:58 PM IST|Updated: Oct 03, 2025, 04:58 PM IST

Samantha Wears Snake Pics Goes Viral: సినిమాలకు కొంత దూరమైన సమంత ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ట్రెండవుతూ ఉంటుంది. ఆమె సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంపై అందరికి ఆసక్తి ఉంది. తాజాగా కొన్ని కొత్త ఫొటోలు పంచుకున్నది. ఆ ఫొటోల్లో సమంత పామును ధరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1/5

సినీ తార సమంత నిత్యం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నా కూడా సమంతపై నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఆమెకు సోషల్‌ మీడియాలో పాపులారిటీ పెరిగిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలు పంచుకోగా అవి వైరల్‌గా మారాయి. అవేమిటో తెలుసుకుందాం.

2/5

హీరోయిన్‌ సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోల్లో సమంత ధరించిన ఆభరణాల గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. సమంత ధరించిన ఆభరణంలో పాము ఉంది. వాటి ప్రత్యేకతను సమంత వివరించింది.

3/5

నీలి రంగు కటౌట్‌ మ్యాక్సీ దుస్తుల్లో మెరిసిన సమంత బొడ్డు కనిపించేలా ప్రత్యేకంగా కనిపించింది. సమంత తన డ్రెస్‌ కన్నా తాను ధరించిన ఆభరణాలు చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె మెడకు ధరించిన ఆభరణంలో పాము ఉంది.

4/5

పాముతో కూడిన నెక్లెస్‌ను సమంత ధరించి ప్రత్యేకంగా కనిపిస్తోంది. బంగారు రంగులో పాము మెరుస్తోంది. అంతేకాకుండా గాజులు, కమ్మలు కూడా పాముతో కూడిన ఆభరణాలు ఉండడం విశేషం.  పాము ఆభరణాల్లో సమంత తళుక్కున మెరిసింది.

5/5

ఆ ఫొటోలను పంచుకున్న సమంత ఈ సందర్భంగా దాని కింద ఇలా రాసుకుంది. 'ఈ రోజు గుర్తుంచుకోదగ్గ సాయంత్రం. బవల్‌గరి ఆ ఆభరణాలను తయారుచేసిందని.. అవి మంత్రముగ్ధులను చేసేలా ఉన్నాయని సమంత తెలిపింది. ఎగ్జిబిషన్‌ను ముంబైలో ఏర్పాటుచేస్తున్నట్లు సమంత చెప్పింది.