Actress Sonarika Bhadoria: టీవీ నుంచి సినిమాల వరకు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది నటి సోనారికా భడోరియా. హిందీ సీరియల్‌లో పార్వతీ పాత్రతో ఓ వెలుగు వెలిగిన సోనారికా.. ఇప్పుడు తల్లిగా తన కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఈ గుడ్‌న్యూస్‌ని తన బేబీ బంప్ ఫొటోలతో పంచుకుంది సోనారికా.
1/72011లో ‘తుమ్ దేనా సాత్ మేరా’ సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది సోనారికా. ‘దేవోన్ కే దేవ్ మహాదేవ్’ సీరియల్‌లోని పార్వతీ పాత్ర.. సోనారికాకు అసలైన స్టార్‌డమ్ తీసుకొచ్చింది.
2/7సీరియల్ తర్వాత సోనారికాను అభిమానులు నిజంగానే పార్వతీ దేవిగా గుర్తు పెట్టుకున్నారు. అలాగే జాదూగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సోనారికా భడోరియా.
3/7ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో బెల్లంకొండ సరసన.. ఈడో రకం ఆడో రకం సినిమాల్లో మంచు విష్ణు సరసన గ్లామర్ రోల్స్ చేసింది.
4/7ఇక 2024లో వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ని సోనారిక పెళ్లి చేసుకుంది. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట.. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు.
5/7పెళ్లి తర్వాత నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన సోనారికా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడూ పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్‌నూ షేర్ చేస్తూ ఉంటుంది.
6/7తాజాగా తమ కుటుంబంలోకి కొత్త అతిథి రాబోతున్నాడని.. తాను అమ్మ కాబోతున్నానంటూ సోనారికా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది.
7/7దీంతో ఈ ఫొటోలు చూసిన సోనారికా భడోరియా ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.