Sreeleela Engagement Rumours: యువ నటి శ్రీలీల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు నెట్టింట జోరుగా హల్ చల్ చేశాయి. దీనికి సంబంధించిన పిక్స్ సైతం నెట్టింట తెగ వైరల్గా మారాయి. తాజాగా.. నటి వీటన్నింటికి ఫుల్ స్టాప్ ఇస్తు బిగ్ క్లారిటీ ఇచ్చింది.
యువనటి శ్రీలీలకు ఎంగెజ్ మెంట్ అయిపోయిందన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండింగ్ గా మారాయి. ముఖ్యంగా..కార్తీక్ ఆర్యన్ కు, శ్రీలీలకు మధ్య డేటింగ్ నడుస్తుందని ఇటీవల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ క్రమంలో శ్రీలీల ఇంట వేడుకగా కార్యక్రమం, దీనిలో పసుపు రాయడం, గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్న కొన్ని పిక్స్ నెట్టింటవైరల్ అయ్యాయి. దీంతో శ్రీలీల అభిమానులు ఒక్కసారిగా పండగ చేసుకున్నారు. యంగ్ హీరోయిన్ కు కంగ్రాట్స్ చెబుతు హల్ చల్ చేశారు.
అయితే.. ఈ వార్తలపై తాజాగా.. నటి శ్రీలీల ఒక క్లారిటీ ఇచ్చారు. అవి నిశ్చితార్థంకు చెందినవి కాదని.. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కు చెందిన వని నటి స్పష్టతను ఇచ్చింది. తన బర్త్ డే జూన్ 14న అని నటి చెప్పుకొచ్చింది. ఈ బర్త్ డే ప్లాన్ అంతా మా అమ్మదగ్గరుండి మరీ చూసుకుందని కూడా నటి అసలు విషయం బైటపెట్టింది.
అందుకే ప్రీబర్త్ డే వేడుకల్లో భాగంగా ఈ విధంగా అందంగా చీరకట్టులో ముస్తాబైనట్లు నటి క్లారిటీ ఇచ్చింది. దీనికి హీరో రానా దగ్గుబాటి ఆయన సతీమణి మిహిక బజాజ్ కూడా హాజరై సందడి చేశారని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. శ్రీలీల జూన్ 14న తన 24వ పుట్టినరోజును జరుపుకోనుంది.ఈ క్రమంలో నటి శ్రీలీల ఎంగెజ్ మెంట్ అన్న వార్తలకు మాత్రం బ్రేక్ పడిందని చెప్పుకొవచ్చు. ఈ పుట్టిన రోజుకు ముందు ప్రీ బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా నటి జరుపుకుంది.