Add Zee Business As A Preferred Source
App

Actress Comments: వేసుకునే డ్రెస్‌ని బట్టి మా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరు..? నెటిజన్లపై విరుచుకుపడ్డ స్టార్ హీరోయిన్..!

Written ByAruna Maharaju
Published: Sep 21, 2025, 06:58 PM IST|Updated: Sep 21, 2025, 06:58 PM IST

Actress Vedhika: హీరోయిన్ వేదిక.. నారా రోహిత్ హీరోగా నటించిన వేదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది వేదిక. రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో నెటిజన్లపై వేదిక చేసిన కామెంట్స్.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Heroine Vedhika Fire On Netizens1/5

సినీ నటి వేదిక

సినీ నటి వేదిక గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మహారాష్ట్రకి చెందిన ఈ అమ్మడు.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

Heroine Vedhika Fire On Netizens2/5

హీరోయిన్ వేదిక

రీసెంట్‌గా వేదిక నటించిన యక్షిణి వెబ్ సిరీస్ రిలీజ్ కాగా.. దీనికి ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా విమర్శకులపై, నెటిజన్స్‌పై ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయింది వేదిక. హీరోయిన్ అనగానే ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడే విధానం మారాలని వేదిక చెప్పుకొచ్చింది.

 

Actress Vedhika3/5

వేదిక యక్షిణి వెబ్ సిరీస్

సోషల్ మీడియాలో హీరోయిన్లపై అనవసరమైన, అసభ్యమైన కామెంట్లు ఎక్కువైపోతున్నాయని.. కేవలం గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన ఒకరి క్యారెక్టర్‌ని తప్పుబట్టడం సరికాదంది వేదిక. ఈ విషయం తనకు చాలా బాధని కలిగించిందని ఎమోషనల్ అయింది.

Actress Vedhika4/5

హీరోయిన్ వేదిక

హీరోయిన్లు వేసుకునే బట్టల గురించి మాట్లాడే బదులు.. వారి పనితీరును గుర్తించాలని వేదిక సూచించింది. తాను నటనలో ఏ పాత్రకైనా సిద్ధమని.. బికినీ వేసుకొని నటించడానికి కూడా వెనుకాడనని చెప్పింది.

Actress Vedhika5/5

హీరోయిన్ వేదిక

నేనెంటో నాకు బాగా తెలుసు.. అయిన మారాల్సింది నేను కాదు.. తప్పుడు మైండ్‌సెట్ ఉన్నవాళ్లు అంటూ మండిపడింది. ప్రస్తుతం వేదిక చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.