Star Heroine: గ్లామర్‌ ప్రపంచం వదిలి.. రైతుగా మారిన స్టార్ హీరోయిన్.. ఎంతటి షాకింగ్ నిర్ణయం..!

Heroine: ఎవరైనా సరే స్టార్ స్టేటస్ ఒకసారి చూస్తే.. ఆ తరువాత కూడా.. అదే కొనసాగించాలి అని చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక నటి మాత్రం.. సెలబ్రిటీగా మంచి పేరు కొనసాగిస్తున్న తరుణంలోనే.. రైతుగా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /4

చిన్న తెరపై తన అందం..నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రతన్ రాజ్‌పుత్..ఇప్పుడు.. పూర్తిగా విభిన్న జీవితం గడుపుతున్నారు. సీరియళ్లలో ప్రముఖత పొందిన ఆమె.. ప్రస్తుతం నటనకు దూరంగా.. గ్రామీణ జీవితాన్ని ఎంచుకున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది..  

2 /4

రతన్ రాజ్‌పుత్ “అగలే జనమ్ మోహే బిటియా హీ కిజో” అనే హిందీ సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆ సీరియల్‌ ద్వారా ఆమెకు అపారమైన పేరు..అభిమానులు దక్కారు. అయితే..ఆమె జీవితంలో అనుకోని మలుపు 2018లో  వచ్చింది. ఆ సంవత్సరం…ఆమె తండ్రి మరణంతో రతన్ తీవ్రంగా కలత చెందారు. ఆ దుఃఖం కారణంగా ఆమెకు మానసిక ఒత్తిడి.. నిరాశ ఎక్కువైంది. చివరకు ఆమె సినిమాలు.. సీరియళ్లను పూర్తిగా వదిలేసి ప్రశాంత జీవితం వైపు అడుగేశారు.

3 /4

నటిగా ఉన్నపుడు రతన్ అనేక టీవీ ప్రాజెక్టులు చేసింది. చివరిసారిగా ఆమె “సంతోషీ మా” అనే సీరియల్‌లో కనిపించారు. ఆ తర్వాత ఆమె టెలివిజన్ ప్రపంచాన్ని పూర్తిగా వీడారు. కొంతకాలం ముంబైలో ఉన్న రతన్.. తన మానసిక స్థితి సరిచేసుకోవడానికి సైకాలజిస్ట్ సహాయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన స్వగ్రామానికి వెళ్లి..అక్కడే నివసించాలనుకున్నారు.

4 /4

ప్రస్తుతం రతన్ రైతుగా జీవనం సాగిస్తున్నారు. పంటలు పండించడం..పల్లెటూరి జీవనాన్ని ఆస్వాదించడం ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. సోషల్ మీడియాలో ఆమె తరచూ తన వ్యవసాయ పనుల ఫోటోలు, వీడియోలు పంచుకుంటుంటారు. అనేక మంది అభిమానులు ఆమె మార్పుపై ఆశ్చర్యపోతూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.