Aditya 369 Re Release: ఏప్రిల్ 4న రీ రిలీజ్ అవుతున్న బాలకృష్ణ ఆల్ టైమ్ క్లాసిక్ ‘ఆదిత్య 369’..

Aditya 369 Re Release: నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. అందులో ‘ఆదిత్య 369’కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవడమే కాదు. బెస్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

 

1 /6

Aditya 369 Re Release: తెలుగు సహా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ నడస్తోంది. ఈ కోవలో బాలకృష్ణ హీరోగా నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369’ చిత్రాన్ని ఏప్రిల్ 4న 4K టెక్నాలజీలో 5.1 సౌండ్ తో   రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

2 /6

1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ‘ఆదిత్య 369’ సినిమాలో బాలయ్య శ్రీ కృష్ణదేవరాయలుగా.. కృష్ణకుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో జీవించారు. అంతేకాదు దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ సినిమాను తెలుగులో ఆల్ టైమ్ క్లాసిక్ గా తీర్చిదిద్దారు.  

3 /6

దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను ఇప్పటి టెక్నికల్ హంగులతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చేలా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఒక వారం ముందుగానే ఏప్రిల్ 4న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

4 /6

మన దేశంలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఫస్ట్ చిత్రం ‘ఆదిత్య 369’. ఈ సినిమాలోని   నటనకు అప్పట్లోనే బాలయ్యకు నేషనల్ అవార్డు అందుకోవాల్సింది. కానీ వివిధ రాజకీయా కారణాలతో రాలేకపోయిందని ఫ్యాన్స్  ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

5 /6

ఆదిత్య 369లో బాలకృష్ణతో పాటు మోహిని, అమ్రిష్ పురి, టినూ ఆనంద్,  సిల్క్ స్మిత, సుత్తివేలు, చంద్రమోహన్, మాస్టర్ తరుణ్, గొల్లపూడి మారుతి రావు, చలపతి రావు, శుభలేఖ సుధాకర్ లీడ్ క్యారెక్టర్స్ లో నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.  

6 /6

ఆదిత్య 369  సినిమా ఎపుడు టెలికాస్ట్ అయినా.. ప్రేక్షకులు  టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. అంతేకాదు ఎపుడు చూసినా.. ఫ్రెష్ గా అనిపిస్తుంటుంది. అంతేకాదు మన దేశంలో తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం రీ రిలీజ్ లో ఎలాంటి వసూళ్లన రాబడుతుందో చూడాలి.