Add Zee Business As A Preferred Source
App

Aditya yogam: మరింత శక్తివంతంగా గ్రహ రాజు ఆదిత్యుడు.. ఈ రాశులకు ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ..

Written ByTA Kiran Kumar
Published: Sep 15, 2025, 05:49 AM IST|Updated: Sep 15, 2025, 07:36 AM IST

Aditya yogam  Effect in these zodiac signs: గ్రహాల రాజు ఆదిత్యుడు నెలకొకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. దీన్నే సూర్య సంక్రమణం అంటారు. ఈ నెల 17న సూర్యుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఆ దేవ దేవుడి ఆశీర్వాదంతో ఈ ఐదు రాశులకు బంపర్ జాక్ పాట్ తగలబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.  

Aditya yogam  Effect in these zodiac signs1/7

కన్య రాశిలో ఆదిత్యు యోగం

Aditya yogam  Effect in these zodiac signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలిక ఎప్పటికప్పుడు శుభాశుభ యోగాలను అందిస్తుంది. అది ఒక వ్యక్తి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.  జ్యోతిషశాస్త్రంలో, సూర్యుడిని ఆత్మ, శక్తి, గౌరవంతో పాటు  నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ శక్తివంతమైన యోగం ఆర్థిక పురోగతి, వృత్తిపరమైన రంగంలో గొప్ప విజయం మరియు జీవితంలో కొత్త అవకాశాలను తీసుకురాబోతుంది. సమాజంలో గౌరవం, పోటీ పరీక్షకలకు సిద్దమయ్యేవారికి అనుకూలంగా ఉండబోతుంది.  

Tula Rasi 2/7

తులా రాశి

తులా రాశి: ఇది తులారాశి వారికి ఇది అత్యంత శుభ సమయం. యోగ కాలం అని చెప్పాలి. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారికి అనుకూల ఫలితాలను అందుకుంటారు. చేసే వ్యాపారంలో గొప్ప లాభాలను అందుకుంటారు. మీ వ్యాపారం దిన దినాభివృద్ది జరుగుతుంది.  మీ ఆర్థిక పరిస్థితి  గతంలో కంటే మరింత  బలపడే అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు కొత్త విజయాలను అందుకుంటారు. 

Dhanassu Rasi 3/7

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. మీకు ఉద్యోగంలో మంచి అవకాశాలు దొరుకుతాయి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు. అదృష్టం మద్దతుతో, మీరు అపారమైన ఆనందం, సంపదను అందుకుంటారు. 

Mesha Rasi 4/7

మేష రాశి

మేష రాశి: ఆదిత్య యోగం వల్ల మేష రాశి వారి కెరీర్‌లో గొప్ప పురోగతి లభించనుంది. మీ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు సీనియర్ అధికారుల నుండి ప్రశంసలు ప్రోత్సాహాన్ని పొందుతారు. అంతేకాదు ఉద్యోగంలో  పదోన్నతి లేదా కొత్త బాధ్యతలను అందుకుంటారు. ఆర్థిక పరంగా కూడా మీరు గొప్ప ప్రయోజనాలను పొందుతారు.ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి.

Vrushchikam 5/7

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి: ఈ యోగం వృశ్చిక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను అందించబోతుంది. పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగేకొద్దీ మీరు సవాళ్లను సులభంగా ఎదుర్కొంటారు.

Simha Rasi 6/7

సింహ రాశి

సింహ రాశి: సింహ రాశిలో సూర్యడి ప్రవేశంతో ఈ రాశి వారికి మంచి ఫలితాలను అందుకోబోతున్నారు. అంతేకాదు ప్రభుత్వ  ఉద్యోగ ప్రయత్నలు ఫలించే అవకాశాలున్నాయి. ఆదిత్య యోగంతో వీరికి రెట్టింపు ప్రయోజనాలు అందుకుంటారు.  మీ వ్యక్తిత్వంతో గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు నాయకత్వ స్థానంలో విజయం అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. 

Disclaimer7/7

గమనిక

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు ఇతర మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడింది. జీ  న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.