Adivi Sesh About 8 Hours Work Shift : అడవి శేషు్ తెలుగువారితో పాటు హిందీ వారికి కూడా సుపరిచితుడే. అయిన నటించిన మేజర్ సినిమా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఉన్ని ముకుందన్ బయోపిక్గా వచ్చిన ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈమధ్య ఒక హిందీ మీడియా ఇంటర్వ్యూకి హాజరైన ఈ హీరో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
1/5గూఢచారి, మేజర్ ఇలాంటి సినిమాలతో సౌత్ ప్రేక్షకుడమే కాకుండా నార్త్ ప్రేక్షకులను కూడా మెప్పిచ్చిన హీరో..అడవి శేషు్. ప్రస్తుతం డేకాయిట్.. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
2/5ఈ క్రమంలో తాజాగా ఒక హిందీ మీడియా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఈ హీరో కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య దీపికా పడుకొనే ఎనిమిది గంటలు షిఫ్ట్ కోరగా.. అది సందీప్ రెడ్డి వంగ ఒప్పుకోలేదని స్పిరిట్ సినిమా నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
3/5ఇక ఇదే విషయం గురించి అడవి శేషు్ ని అడగగా.. అది దీపికా విషయంలో మాత్రమే కాదని ప్రతి ఒక్కరి విషయంలో వారి వారి ఇష్టాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
4/5వెన్నెల కిషోర్ తెలుగులో చాలా ఫేమస్ అని.. అందుకే అతని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల వారం మొత్తానికి కలిపి మూడు గంటలు వచ్చి షూటింగ్ చేసుకుని పోయే వారని చెప్పుకోచ్చారు.
5/5కాబట్టి ఆ టైమింగ్ కావాలి ఈ టైమింగ్ కావాలి అనేది కాకుండా...నటీనటులకు అలానే డైరెక్టర్ కి అనుకూలంగా షూటింగ్ అనేది జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.