Adnan Sami weight loss journey: అద్నాన్ సమీ భారతీయ పౌరసత్వం పొందిన పాకిస్థానీ గాయకుడు. ఈయన ఒకపుడు 230 కిలోల అధిక బరువుతో బాధపడేవారు. ఆ తర్వాత స్ట్రిక్ట్ డైట్ తో ఏకండా 230 కిలోల నుంచి 110 కిలోలకు బరువు తగ్గాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో ఆయనే ప్రస్తావించారు.
Adnan Sami weight loss journey: అద్నాన్ సమీ హిందీలో ‘లిఫ్ట్ కరాదే’ పాటతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా తెరకెక్కిన ‘అజ్నబి’ సినిమాలో మెహబూబా పాటతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఏ జిల్లా పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ్యారు. ఈయన ఒకపుడు 230 కిలోలకు పైగా భారీ కాయంతో ఉండేవారు. అయితే ఈయన స్ట్రిక్ట్ డైట్ తో ఆరు నెలల వ్యవధిలో ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా ఏకంగా 120 కిలోల బరువు తగ్గడం అందరికీ ప్రేరణగా నిలిచారు.
అద్నాన్ సమీ బరవు తగ్గే క్రమంలో తన డైట్ లో బ్రెడ్, బియ్యం, చక్కెర, నూనె వంటి ఆహార పదార్ధాలను టచ్ చేయకుండా నోరు కట్టేసుకోవడంతో ఈయన భారీగా బరువు తగ్గడం విశేషం. అద్నాన్ సమీ తన వెయిట్ లాస్ జర్నీగురించి మాట్లాడుతూ... బరువు తగ్గడానికి తాను లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరి వంటి శస్త్ర చికిత్సల జోలికి వెళ్లలేదని చెప్పాడు.
లైపోసక్షన్ అనేది సూదిలో మన శరీరంలో కొన్ని నిర్దేశిత ప్రాంతాల నుంచి కొవ్వును తెలిగించే ప్రక్రియ. అలా అని బేరియాట్రిక్ సర్జరీ కూడా అలాంటిదే. అయతే బరువు తగ్గడానికి తనకు తన డైటీషియన్ సూచించిన కొన్ని కఠినమైన ఎక్కువ ప్రొటీన్ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చారు.
తన బరువు తగ్గే క్రమంలో రొట్టె, బియ్యం, చక్కెర, నూనె, ఆల్కహాల్ వంటి పదార్ధాలను ఎక్కడా వాడలేదని చెప్పారు. అలా చేయడం వలన తాను క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమైందన్నారు. ముందు బరువు తగ్గుతానా అనే సందేహం నాలో ఉండేది. ఇలా స్ట్రిక్ట్ డైట్ తో ఫస్ట్ మంత్ లో 20 కిలోల తగ్గాను. దాంతో ఎంతో నాలో ఆశలు చిగురించాయన్నారు. దాంతో రెట్టించిన ఉత్సాహాంతో నోరును కట్టేసుకొని డైట్ ను గుడ్డిగా ఫాలో అయ్యాను.
ఈ సందర్భంగా అద్నాన్ మాట్లాడుతూ.. ఒక షాపింగ్ మాల్‌లో ఉన్నప్పుడు XLలో ఉన్న టీ-షర్టును చూశాను,. ఆ సమయంలో నా బరువు 9XL. నాకు ఆ టీ షర్ట్ తన మనుసుకు ఆకట్టుకుందన్నారు. ఏ రోజైనా దాన్ని ధరించాలనేదే తన సంకల్పంతో ఆ టీ షర్ట్ కొని ఇంట్లో పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఆ తర్వాత క్రమంగా XL కు తన బరువు తగ్గిన విషయాన్ని ప్రస్తావింాచారు. ఈ సందర్భంగా అద్నాన్ మాట్లాడుతూ.. కొంత బరువు తగ్గినట్లు నాకు అనిపించినప్పుడల్లా, ఆ చొక్కాను ధరించేవాడినన్నారు. కొన్నిసార్లు రాత్రికి రెండు లేదా మూడు సార్లు అది సరిపోతుందో లేదో చూడటానికి ప్రయత్నించేవారట. అప్పుడు, ఒకరోజు, నేను ధరిస్తే సరిగ్గా సరిపోయింది.ఆ తర్వాత ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నాను. ఇలా కఠిన ఆహార నియమాల ద్వారానే బరువు తగ్గిన విషయాన్ని అద్నాన్ పంచుకొని బరువు తగ్గాలనుకునే వారికి ప్రేరణగా నిలిచారు.