Add Zee Business As A Preferred Source
App

Deepika Padukone: కల్కీ సీక్వెల్ నుంచి దీపిక పదుకొణె అవుట్.. బాలీవుడ్ భామకు ఊహించని షాక్ ఇచ్చిన మూవీ టీమ్..

Written ByInamdar Paresh
Published: Sep 18, 2025, 01:18 PM IST|Updated: Sep 18, 2025, 01:39 PM IST

Kalki team big shock to Deepika Padukone:  కల్కి సీక్వెల్ లో దీపికా నటించడం లేదని వైజయంతి మూవీస్ టీమ్ అధికారికంగా  అనౌన్స్ చేశారు. ఇలాంటి మూవీస్ విషయంలో కమిట్మెంట్స్ సరిపోవని అన్నారు. అందుకే తాము దీపికను కొనసాగించలేకపోతున్నామంటూ కూడా మూవీ టీమ్ అధికారికంగా ట్విట్ చేశారు.
 

Deepika padukone:1/6

దీపికా పదుకొణే లేటెస్ట్ న్యూస్:

బాలీవుడ్ భామ దీపిక పదుకొణెకు ఇటీవల అనేక ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఇప్పటికే స్పిరిట్ విషయంలో డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా కోసం దీపికను సంప్రదించారు. అప్పుడు ఆమె పెట్టిన కండీషన్స్ నచ్చక ఆమెను వదులుకున్నారు. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు దీపిక వర్సెస్ సందీప్ రెడ్డి వంగ మధ్య కొన్నిరోజుల పాటు ట్విట్ వార్ నడిచిన విషయం తెలిసిందే.

kalki 2898:2/6

కల్కీ మూవీ2898:

అయితే.. తాజాగా..  కల్కి సినిమా సీక్వెల్ నుంచి దీపికను తప్పిస్తూ కల్కి టీమ్ షాకింగ్ అనౌన్స్ మెంట్ చేయడం పెను సంచలనంగా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, డార్లింగ్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్ గా కల్కీ  2898 ఏడీ మూవీ గతేడాది జున్ 27న విడుదలైంది.   

deepika padukone latest news:3/6

దీపికా పదుకొణే:

వరల్డ్ వైడ్ గా  బాక్సాఫీస్ మీదభారీ వసూళ్లను రాబట్టింది.  వీరితో పాటు.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి పాన్ ఇండియన్ సెలబ్రిటీలు కీలకపాత్రలు పోషించారు.   

bollywood:4/6

బాలీవుడ్:

దశవతారాల్లో ఒక అవతారమైన కల్కి నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. కల్కీలో దీపికా పదుకొణే.. సుమతిగా చేశారు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న కూడా తన రోల్ కు న్యాయం చేశారని అభిమానుల నుంచి భారీగా ప్రశంసలు పొందారు.   

Deepika Padukone:5/6

ప్రభాస్:

బాహుబలి తర్వాత ప్రభాస్ మరోమూవీ ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.ఈ నేపథ్యంలో..  అయితే తాజాగా కల్కి సినిమా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. కల్కీ సీక్వెల్ లో దీపిక నటించడంలేదని చెప్పారు.  

 Deepika Padukone role in kalki sequel:6/6

దీపికా పదుకొణే:

 దీనిపై దీపికతో మూవీ టీమ్ చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు  డైరెక్టర్ చెప్పారు. అయితే.. ఇక్కడ కూడా  కమిట్మెంట్స్ ( రోజుకు ఎనిమిదిగంటలే పని చేస్తా).. అంటూ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మూవీ టీమ్ , దీపికతో మాట్లాడి.. ఈమేరకు అధికారంగా ప్రకటన చేశారు.  అంతే కాకుండా దీపికా తదుపరి సినిమాలకు బెస్ట్ విషెస్ అంటూ కూడా మూవీ టీమ్ ట్విట్ చేసింది. ఈ అనౌన్స్ మెంట్ తో దీపికా అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.