Air Conditioner Price Drop In Croma: ప్రముఖ టాటా కంపెనీ క్రోమా ఎలక్ట్రానిక్స్ సమ్మర్ సందర్భంగా మిడిల్ క్లాస్ ఏసీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని చీపు ధరలకు మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన ఏసీలను విక్రయిస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది..
Croma Ac Best Offers In Telugu: సమ్మర్ వచ్చిందంటే చాలు ఉక్కపోత మామూలుగా ఉండదు.. ఒక పక్క ఫ్యాన్ నడుస్తుండగానే కింద చెమటను పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో చాలామంది ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి కూలర్స్, ఏసీలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మధ్యతరగతి వారు ఏసీలు కొనడం కష్టం కాబట్టి ఎక్కువగా కూలర్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే ధరలకు ఏసీలను విక్రయిస్తున్నాయి కొన్ని ఈ కామర్స్ కంపెనీలు..
ముఖ్యంగా కొన్ని ఈ కామర్స్ వెబ్ సైట్స్‌లలో ఎయిర్ కండిషనర్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లతో పోలిస్తే కొన్ని వెబ్సైట్లు అత్యంత తక్కువ ధరలకి ఏసీలను విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా టాటా క్రోమా వెబ్సైట్లో ఏసీలను కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
మిడిల్ బడ్జెట్ పీపుల్స్‌ను దృష్టిలో పెట్టుకొని టాటా క్రోమా ప్రత్యేకమైన సమ్మర్ సేవింగ్స్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా సాధారణ వినియోగదారుడు కూడా కొనుగోలు చేసే ధరల్లో ఏసీలను విక్రయిస్తోంది. అయితే ఈ సేల్‌లో భాగంగా ఏయే బ్రాండ్లకు సంబంధించిన ఏసీలు అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
సగం ధరలకు మంచి ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా క్రోమా సమ్మర్ సేవింగ్స్ డేస్ సేల్ అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఎల్జీ కంపెనీ గతంలో విడుదల చేసిన 1.5 టన్ ఏసి అత్యంత తగ్గింపు ధరకే లభిస్తుంది. దీని ధర మార్కెట్లో రూ.78,990 కాగా ఈ ప్రత్యేకమైన సేల్ లో భాగంగా 53% తగ్గింపుతో కేవలం రూ.37, 190కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిని కొనుగోలు చేసే సమయంలో కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది..
మిడియా 1.5 టన్ను AC పై కూడా టాటా క్రోమా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తోంది. ఈ AC టాటా క్రోమాపై 51 శాతం ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.68,990, కాగా.. టాటా క్రోమాలో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ.33, 890కే పొందవచ్చు..
టాటా సబ్ బ్రాండ్ వోల్టాస్ 1.3 టన్ను AC పై కూడా టాటా క్రోమాలో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా క్రోమా 50% వరకు తగ్గింపు నందిస్తోంది. మార్కెట్లో దీని ధర రూ.71,276 కాగా.. ఇప్పుడే క్రోమాలో కొనుగోలు చేసే వారికి కేవలం రూ.35,990కే అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.