Airtel: ఎయిర్‌టెల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌.. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ తెలిస్తే షాకే..

Airtel 365 Days Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 365 రోజుల వాలిడిటీ ప్లాన్‌ పరిచయం చేసింది. ముఖ్యంగా ఇది వాయిస్ కాల్స్ ఉపయోగించేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులకు బెస్ట్‌ ప్లాన్‌. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు, మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.
 

1 /5

ఎయిర్‌టెల్ 380 మంది మిలియన్ యూజర్లతో ఉంది. ఇందులో లాంగ్ టైం వాలిడిటీ ప్లాన్స్ అతి తక్కువ ధరలోనే ఉంటున్నాయి. అయితే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు వర్తించే ప్లాన్స్ ఉన్నాయి.  

2 /5

ఎయిర్‌టెల్ రూ.359 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయినా చేసుకునే సౌకర్యం ఉంటుంది. అంతేకాదు ఇందులో ఫ్రీ నేషనల్ రోమింగ్ కూడా చేసుకోవచ్చు. 2 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్‌ డేటా తో పాటు ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు.  

3 /5

ఒకవేళ మీ ఏరియాలో 5జి సిగ్నల్స్ అందుబాటులో ఉంటే ఆ సేవలు కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ అందిస్తున్న మరో వ్యాలిడిటీ ప్లాన్ రూ.3,999 మాత్రమే. దీని వ్యాలిడిటీ కూడా 365 రోజులు. ఇందులో కూడా మీరు ఉచితంగా డేటాతో పాటు జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు.  

4 /5

ఈ రూ.3999 రీఛార్జి ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ దేశవ్యాప్తంగా చేసుకోవచ్చు. ఇందులో ఫ్రీ రోమింగ్ తో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందుతారు. ప్రతిరోజు 2.5 జిబి డేటా తో పాటు 100 ఎస్ఎంఎస్లు ఉచితం.  

5 /5

ఇది కూడా 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌కు వర్తిస్తుంది. మీ  ప్రాంతంలో 5g సేవలు అందుబాటులో ఉంటే మీరు 5g  డేటాను ఎంజాయ్ చేయవచ్చు