Add Zee Business As A Preferred Source
App

Airtel: ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆల్‌ ఇన్‌ వన్‌ రీఛార్జీ ప్లాన్‌, 189 దేశాల్లో కూడా..

Written ByRenuka Godugu
Published: Apr 26, 2025, 04:22 PM IST|Updated: Apr 26, 2025, 04:22 PM IST

Airtel All In One Plan: ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ తో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మిలియన్ల యూజర్లు కలిగిన ఎయిర్‌టెల్ ఇప్పుడు ఇండియాతో పాటు ఈ 189 దేశాల్లో కూడా వాడుకునే ప్లాన్ పరిచయం చేసింది. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

Airtel1/6

 ఎయిర్‌టెల్

 ఎయిర్‌టెల్ సరికొత్త 365 రోజుల ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఇది భారత్‌లో మాత్రమే కాదు 189 దేశాల్లో కూడా ఈ వర్తిస్తుంది. దీని ధర కేవలం రూ.4000 మాత్రమే.  ఈ రీఛార్జ్ ప్లాన్‌ అందులో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో మీరు 5gb డేటా 100 మినిట్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇంటర్నేషనల్ వినియోగించుకోవచ్చు.  

Flight Journey2/6

ఫ్లైట్‌ జర్నీ

 ఇది మాత్రమే కాదు అదనంగా ఫ్లైట్‌ జర్నీ చేసేటప్పుడు కూడా కనెక్టివిటీ 250gb డేటా ప్రయాణించేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది కొన్ని సెలెక్టెడ్ ఎయిర్ లైన్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది.   

Sim Card3/6

సిమ్ కార్డు

ఇదివరకు విదేశాలకు వెళ్తే మన సిమ్ కార్డు పనిచేయదు. అక్కడ కొత్త సిమ్‌ కార్డు కొనుగోలు చేయాల్సిందే. మళ్ళీ కొత్త నంబర్ ఇదంతా కాకుండా ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీరు ఏకంగా 189 దేశాల్ ఉపయోగించవచ్చు. డొమెస్టిక్‌లో కూడా ఫ్రీ  కాలింగ్ 365 రోజులు పొందుతారు.   

High Speed data4/6

హై స్పీడ్ డేటా

ఇందులో ప్రతిరోజు 1.5 జీబీ హై స్పీడ్ డేటా వస్తుంది ఇది మాత్రమే కాదు ఇందులో 100 ఎస్ఎంఎస్ లు కూడా ఫ్రీ. తరచూ విదేశాలకు వెళ్లే వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. 189 దేశాలకు ఇది వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ కొత్తగా రూ.451 రీఛార్జ్ ప్లానింగ్ కూడా తీసుకువచ్చింది. ఇందులో జియో హాట్ స్టార్ కూడా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీని వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది ఇందులో 50gb డేటా పొందుతారు.   

Complimentary5/6

కాంప్లిమెంటరీ

ఈ ప్లాన్‌లో కాంప్లిమెంటరీగా జియో హాట్ స్టార్ మూడు నెలలపాటు వర్తిస్తుంది. అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు ఐపీఎల్ చూసే వారికి ఇది బంపర్ ప్లాన్ అని చెప్పొచ్చు. గతంలో రెండు అడిషనల్ డేటా ఓచర్స్ కూడా కంపెనీ పరిచయం చేసింది. రూ. 100, రూ. 195 ప్లాన్స్  అందుబాటులో ఉన్నాయి.  

Jio Hotstar6/6

జియో హాట్‌ స్టార్‌

రూ.100 ప్లాన్ లో 5gb డేటా 30 రోజులు వ్యాలిడిటీతోపాటు జియో హాట్‌ స్టార్‌ మొబైల్ వెర్షన్‌ వస్తుంది. ఇక రూ.195 మొబైల్ ప్లాన్ 15 జిబి డేటా 3 నెలల పాటు జియో హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందే వెసులుబాటు కూడా ఉంది.