Airtel Rs 189 Plan Discontinues: ఎయిర్‌టెల్ యూజర్‌లకు బిగ్ షాక్.. ఎంట్రీ లెవల్ ప్లాన్ రద్ద చేసిన ప్రైవేటు టెలికాం కంపెనీ. దీంతో యూజర్‌లపై అదనపు భారం పడనుంది. ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ ప్లాన్ అత్యంత తక్కువ ధరలోనే అపరిమిత ఆఫర్స్ ప్రకటించారు. ఎయిర్‌టెల్ రూ.189 ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ యూజర్‌లకు బిగ్‌షాక్ తగిలింది. రూ.189 ప్లాన్ రద్దు చేసింది. రూ.199 ప్లాన్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ ప్లాన్‌గా ప్రారంభం కానుంది. ఈ ప్లాన్ అధికారిక వెబ్‌సైట్ లేదా థర్డ్ పార్టీ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్ పొందుతారు. ఇది వరకు ఈ ప్లాన్ ధర కేవలం రూ.189 మాత్రమే ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.199 మాత్రమే
రూ.189 ఎయిర్‌టెల్ ప్లాన్ వ్యాలిడిటీ 21 రోజులు వర్తిస్తుంది. ఇందులో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్, 1 జీబీ మొబైల్ డేటాతోపాటు 300 ఎస్‌ఎంఎస్ బెనిఫిట్ పొందుతారు
రూ.199 రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ ప్లాన్. ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించని వారికి ఇది బంపర్ ప్లాన్ కానీ వ్యాలిడిటీ మాత్రం 28 రోజులు లభిస్తుంది. ఇందులో కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ బెనిఫిట్ లభిస్తుంది
దీంతోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్ సౌకర్యం లభిస్తుంది. మొత్తంగా పూర్తి వ్యాలిడిటీ సమయంలో 2 జీబీ డేటా లభిస్తుంది. ఇది కూడా సెకండ్ రీఛార్జ్ చేసుకునే వారికి బంపర్ ప్లాన్
2 జీబీ డేటా కూడా పూర్తయిపోయిన తర్వాత ఒక్క ఎంబీ నెట్‌కు రూ.0.5 ఛార్జీ చేస్తారు. దీని తర్వాత నెక్ట్స్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.219 మాత్రమే. పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎయిర్‌టెల్ మరోసారి బేసిక్ ప్లాన్ ధరలో మార్పులు చేసింది. ధరలు పెంచడంతో యూజర్‌లపై భారం పడునుంది.