Actress Aishwarya Rai: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ బచ్చన్.. తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
1/5బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అశ్లీల ఫొటోలు క్రియేట్ చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఆమె హైకోర్టును కోరారు.
2/5తన వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఐశ్వర్య రాయ్ తెలిపారు. ఇక ఈ హీరోయిన్ తరపున సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ కోర్టులో వాదించారు. ఐశ్వర్య రాయ్ పేరు, ఫోటోలను ఎవరైనా ఉపయోగించి డబ్బు సంపాదించడం లేదా అశ్లీల కంటెంట్ క్రియేట్ చేయడం చాలా తప్పన్నారు.
3/5ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలను అనధికారికంగా ఉపయోగించకుండా నిరోధించడానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
4/5ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందు, ఆ తర్వాత జనవరి 15, 2026న కోర్టు ముందు జరుగనుంది.
5/5ఇక ఐశ్వర్య రాయ్ చివరిసారిగా మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఆమె ఆ చిత్రంలోని రెండు భాగాలలోనూ నందిని మరియు ఉమై రాణి పాత్రలను పోషించింది.