Balakrishna Recent Movies Pre Release Business: నందమూరి బాలకృష్ణ తన కెరీర పరంగా పీక్స్ లో ఉన్నారు. అఖండ నుంచి బాలయ్య సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా ‘అఖండ 2 తాండవం’ మూవీ బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో బాలయ్య లాస్ట్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..
1/5అఖండ 2 తాండవం..
‘అఖండ 2 తాండవం’ సినిమా బాలయ్య కెరీర్ లో తొలిసారి రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా రూ. 114.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 65 యేళ్ల వయసులో బాలయ్య తన కెరీర్ బెస్ట్ బిజినెస్ అందుకోవడం మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి చరిత్ర క్రియేట్ చేస్తాడో చూడాలి.
2/5డాకు మహారాజ్..
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో యాక్ట్ చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాలయ్య కెరీర్ లో అఖండ 2 ముందు వరకు హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా ఉండేది.
3/5భగవంత్ కేసరి.. బాలకృష్ణ టైటిల్ రోల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో తన వయసుకు తగ్గ పాత్రలో నటించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
4/5వీరసింహారెడ్డి.. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ కథానాయకుడిగా యాక్ట్ చేసిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
5/5అఖండ.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. బాలయ్య ఈ చిత్రంలో రైతుగా.. అఘోరాగా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.