Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు కొనాల్సింది బంగారం కాదు..!.. 95 శాతం మందికి తెలియని పచ్చి నిజాలు ఏంటంటే..?

Akshaya Tritiya Tradition: చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే నియమంను పాటిస్తారు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడలేదని, ఇది కేవలం కొంత మంది వ్యాపారులు తమ లాభార్జన కోసం ఇలాంటి సంప్రదాయంను తీసుకొచ్చారని పండితులు చెబుతున్నారు.
 

1 /5

సాధారణంగా మన హిందు సంప్రదాయంలో అనేక పండుగలు, సంప్రదాయాలను పాటిస్తాం. అయితే.. ఈసారి అక్షయ తృతీయను ఏప్రిల్ 30 వ తేదీన జరుపుకోబోతున్నాం. అక్షయం అంటే. . క్షయంలేనిది..అంటే ఆరోజు ఏపనిచేసిన.. ఏ కార్యం తలపెట్టిన కూడా విజయవంతమౌతుందని పండితులు అనాదీగా చెబుతుంటారు.  

2 /5

చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఒక సెంటిమెంట్ ను పెట్టుకుంటారు. కనీసం గురివిత్తు గింజ ప్రమాణంలో అయిన బంగారం కొనాలని చాలా మంది నియమాల్ని పాటిస్తారు. కానీ కొంత మంది పండితులు మాత్రం ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తుంటారు.  

3 /5

అసలు.. అక్షయ తృతీయ రోజున దశవతారాల్లో ఒకరైన పరశురాముడి జయంతి. అంతే కాకుండా.. ఈ రోజున తప్పకుండా చేయాల్సిన ఐదు పనులు .. అది కూడా మన శాస్త్రాల్లో ఉన్నవాటిని ప్రమాణ పూర్వకంగా పండితులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.  

4 /5

అక్షయ తృతీయ రోజున ఉధుకుంభ దానం చేయాలి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఉధుకుంభ దానం అంటే... నీళ్లతో నింపిన కుండల్ని వేదబ్రాహ్మాణునిడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే చనిపోయిన మన పూర్వీకులకు ఈ దానం దక్కుతుందని పండితులు చెబుతుంటారు. ఆ తర్వాత పాదరక్షలు, విసన కర్ర, గొడుగు, వస్త్రదానం, తోచిన ఫలాలు... ఇవి దానంగా ఇవ్వాలని శాస్త్రలలో స్పష్టంగా ఉంది.

5 /5

అంతే  కాకుండా.. పేదల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే.. లేదా ఏర్పాటు చేసిన వాళ్లకు ఏరమైన సాయం చేసిన కూడా అది అక్షయ ఫలితాలు ఇస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే  అక్షయ తృతీయరోజున బంగారం కొనకుండా.. పైన చెప్పిన వాటిని దానంగా చేస్తే జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండితులు చెబుతున్నారు.